Time And Location At Moon: చంద్రుడిపై టైం, మ్యాప్ కనుగొనేందుకు సరికొత్త ప్రణాళికలు సిద్దం చేస్తున్న శాస్త్రవేత్తలు..

చంద్రుడిపై సమయాన్ని, మ్యాప్ ను కనుగొనేందుకు యూరోపియన్ దేశాలు ముందుకు వస్తున్నాయి. రానున్న రోజుల్లో మరికొన్ని దేశాలు చంద్ర మండలం పై పనిచేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

  • Written By:
  • Publish Date - September 23, 2023 / 01:54 PM IST

ప్రస్తుతం మన భూమి మీద టైం ఎంత అంటే దేశాన్ని బట్టి ఒక్కో రకంగా చెబుతూ ఉంటాం. అదే ఇతర గ్రహాలపై టైం చెప్పలేని పరిస్థితి. ఇక తాజాగా చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం కావడంతో అందరి చూపు చంద్రుడిపైనే మళ్లింది. తాజాగా చంద్రుడిపై టైం ఎంత అనే అంశం వెలుగులోకి వచ్చింది. దీనిని త్వరలోనే కనుగొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే చంద్రుడిపై సమయాన్ని చెప్పడం సాధ్యం కాదు. అయితే భూమిపై ఏవిధంగా టైం ఉంటుందో అంతరిక్షంలో కూడా కచ్చినమైన సమయాన్ని కనుగొనవచ్చు. రానున్న రోజుల్లో అనేక దేశాలు చంద్రుడి పై ప్రయోగాలు చేసేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో అక్కడ సమయాన్ని గుర్తించడమే లక్ష్యంగా ప్రయోగాలు చేపడుతున్నాయి.

చంద్రుడిపై టైం ఎందుకు ఉపయోగపడుతుంది..

భవిష్యత్తులో చంద్రమండలం పైనుంచే పనిచేయాలని కొన్ని దేశాలు ప్రణాళికలు రచించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో ఎన్నిగంటలు పనిచేస్తున్నామో తెలుసుకోవల్సిన అవసరం తప్పనిసరి అవుతుంది. అందుకే వివిధ రకాలా అంతరిక్ష పరిశోధనా సంస్థలకు ఉపయోగకరంగా ఉండేందుకు సమయాన్ని కనుగొనాలని యూరోపియన్ స్పేస్ సెంటర్ భావిస్తోంది. అలాగే ప్రస్తుతం చంద్రమండలం పై సొంతంగా ఒక నిర్థిష్టమైన సమయం అంటూ లేదు. కేవలం యూనివర్సల్ టైం ను ఉపయోగించే పరిశోధనలు జరుపుతున్నారు. దీంతో ఎక్కువ కాలం పరిశోధనలు చేయలేమని చెబుతోంది ఈ అంతరిక్ష పరిశోధనా సంస్థ.

చంద్రడిపై మ్యాప్స్ తయారు చేసేందుకు సిద్దం..

సమయంతో పాటూ మ్యాప్ ను కూడా సిద్దం చేయాలని చెబుతోంది ఈ అంతరిక్ష పరిశోధనా సంస్థ. చంద్రుడి పై ఒక చోటు నుంచి మరోచోటకు చేరుకునేందుకు వీలుగా ఉండేలా, వాటిని గుర్తించేలా మ్యాప్ ను కూడా కనుగొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికోసం నాసాతో కలిసి పనిచేసేందుకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ముందుకు వచ్చింది. దీని ద్వారా మన ల్యాండర్లు అక్కడకు చేరుకున్న వెంటనే లొకేషన్ ద్వారా ఆపరేట్ చేసి అనుకున్న ప్రదేశాలకు చేరుకోవచ్చు. తద్వారా సమయం కలిసి వస్తుంది. ప్రయోగం త్వరగా ఫలితాలను ఇస్తుంది. అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాముల జాడ కనుగొనేందుకు ఇది సహాయపడుతుంది.

చంద్రుడిపై సమయం లేకపోవడానికి కారణం ఇదే..

చంద్రుడిపై సమయాన్ని గుర్తించాలంటే ఏదో ఒక దేశం నిర్దిష్ట కాలం పాటూ ప్రయోగాలకు కేటాయించాల్సి ఉంటుంది. దీనిపై ఎవరూ ఇప్పటి వరకూ బాధ్యత తీసుకోలేదు. పైగా చంద్రుడిపై గడియారాలు భూమిపై కంటే అధిక వేగంతో భ్రమిస్తాయి. అందుకే సమయాన్ని గుర్తించడం కాస్త ఇబ్బంది కరంగా మారుతోంది. భూమి పై 24 గంటలతో పోలిస్తే చంద్రుడి గడియారం 56 మైక్రో సెకన్లు ఎక్కువగా తిరుగుతుంది. దీనికి గల ప్రదాన కారణం అక్కడ గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉండటమే అంటున్నారు పరిశోధకులు. దీని కారణంగానే అంతరిక్ష ప్రయోగాలు చేసే వారు కొన్నింట విజయం సాధిస్తుంటే మరి కొన్ని విఫలం అవుతున్నాయి. ఎందుకంటే భూమి పై ఉన్న సమయాన్ని బట్టి చంద్రడి సమయాన్ని లెక్కించడం వల్ల అప్పుడప్పుడూ కొన్ని సాంకేతిక తప్పిదాలు దొర్లుతూ ఉంటాయి అని చెబుతున్నారు నిపుణులు.

T.V.SRIKAR