Chandramohan lost 100 crores : 100కోట్లు పోగొట్టుకున్న చంద్రమోహన్.. సంపాదన కంటే కోల్పోయిందే ఎక్కువ

హైదరాబాద్‌లోని కోంపల్లిలో నటుడు గొల్లపూడి మారుతీరావు ఓ ద్రాక్ష తోట కొన్నారు. ఇదే విషయం చంద్రమోహన్ కు కూడా చెప్పి తనను కూడా కొనమన్నారు. దాంతో చంద్రమోహన్‌ కొంపల్లిలో 35 ఎకరాల దాకా భూమి కొన్నారు. కానీ సినిమాల బిజీలో ఆ ఆస్తిని చూసుకోవడం వీలుపడలేదు. భూమిని కొన్నాం సరే.. చూసుకునే అవకాశం లేనప్పుడు అది ఆక్రమణలకు గురయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు తాను పెట్టిన డబ్బులు వృధా అవుతాయి అనుకున్నారు చంద్రమోహన్.

నటుడు చంద్రమోహన్ (Chandramohan) తాను సంపాదించిన దానికంటే పోగొట్టుకుందే ఎక్కువ అని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 50యేళ్ళకు పైగా ఇండస్ట్రీలో ఉండి.. 900కు పైగా సినిమాల్లో నటించినా.. పెద్దగా ఆస్తి కూడబెట్టుకోలేకపోయాడు. ఉన్న ఆస్తినే తక్కువ ధరకు అమ్ముకొని 100 కోట్ల దాకా నష్టపోయాడు చంద్రమోహన్.

హైదరాబాద్‌లోని కోంపల్లిలో నటుడు గొల్లపూడి మారుతీరావు ఓ ద్రాక్ష తోట కొన్నారు. ఇదే విషయం చంద్రమోహన్ కు కూడా చెప్పి తనను కూడా కొనమన్నారు. దాంతో చంద్రమోహన్‌ కొంపల్లిలో 35 ఎకరాల దాకా భూమి కొన్నారు. కానీ సినిమాల బిజీలో ఆ ఆస్తిని చూసుకోవడం వీలుపడలేదు. భూమిని కొన్నాం సరే.. చూసుకునే అవకాశం లేనప్పుడు అది ఆక్రమణలకు గురయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు తాను పెట్టిన డబ్బులు వృధా అవుతాయి అనుకున్నారు చంద్రమోహన్. ఎందుకు దాన్ని అలాగే తన దగ్గర ఉంచుకోవడం అనుకొని.. కోంపల్లిలోని 35 ఎకరాల్లో కనీసం ఒక్క ఎకరం కూడా ఉంచుకోకుండా అంతా అమ్మేశారు. కానీ ఇప్పుడు అదే కోంపల్లిలో భూమి కోట్ల రూపాయల ధర పలుకుతోంది. అంతేకాదు.. భూమిని అమ్ముకోవద్దని శోభన్‌బాబు సినీ ఇండస్ట్రీలో అందరికీ చెబుతుండేవాడు. అలాగే చంద్రమోహన్ కి కూడా చెప్పారు. అయినా వినకుండా చెన్నైలో 15 ఎకరాలను కూడా అమ్మేశారు. ప్రస్తుతం ఆ ల్యాండ్ కాస్ట్ 30 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుంది. శంషాబాద్‌లో మెయిన్ రోడ్డు పక్కన ఆరు ఎకరాలు భూమి కూడా చంద్రమోహన్ కొన్నారు. కానీ దాన్ని కూడా ఉంచుకోకుండా మొత్తం అమ్మేశారు.

ఇలా దాదాపు వంద కోట్లు విలువ చేసే ఆస్తులు పోగొట్టుకున్నానని అప్పట్లో ఇంటర్వ్యూలో చంద్రమోహన్ చెప్పారు. అసలు తాను సంపాదించిన దానికన్నా పోగొట్టుకున్నదే ఎక్కువని బాధపడ్డారు. చంద్రమోహన్‌ దగ్గర ఆస్తి అయితే ఉండలేదు కానీ… ఆయన చేతితో ఒక్క రూపాయి అప్పు తీసుకున్నా బాగా కలిసొస్తుందంటారు సన్నిహితులు, సినిమా పరిశ్రమకు చెందినవారు. అందుకే కొత్త ఏడాది… అంటే జనవరి ఒకటి వస్తే… చాలా మంది ఆయన ఇంటికి వచ్చి ఎంతో కొంత డబ్బులు తీసుకునేవారని చంద్రమోహన్‌ భార్య, రచయిత్రి జలంధర తెలిపారు. అంత పెద్ద స్టార్‌ నటుడిగా తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో గుర్తింపు పొందిన చంద్రమోహన్.. చివరి రోజుల్లో డబ్బులు లేని వాడిగా నార్మల్ లైఫ్ గడిపారు.