రామ్, పూరీ సినిమా డబుల్ ఇస్మార్ట్ మొదలై రెండునెలలు కావస్తున్నా ఇంతవరకు మ్యూజిక్ డైరెక్ట్ పేరు ఎనౌన్స్ చేయలేదు. బైటకి చెప్పకపోయినా.. ఓ మ్యూజిక్ డైరెక్టర్‌ని తీసుకోవడం.. ఆల్రెడీ ఒక పాట కూడా ఇచ్చేయడం కూడా జరిగిపోయింది. ఇంతకీ హిట్ సీక్వెల్‌కు సంగీత ఇస్తోంది మణిశర్మ ఆట. మణిశర్మ సెకండ్ ఇన్నింగ్స్ ఇస్మార్ట్ శంకర్‌తో మొదలైందనే చెప్పాలి. 90వ దశకంలో వరుస హిట్స్‌తో దూసుకుపోయిన ఈ స్వర బ్రహ్మకు హిట్ పడడమే గగనమైపోయింది. ఫేటౌడ్ అయిపోయిన టైంలో ఇస్మార్ట్ సక్సెస్ మణిశర్మ కెరీర్‌కు ఊపిరిపోసింది. మణి,పూరీ కాంబోలో వచ్చిన పోకిరి మ్యూజికల్ హిట్‌గా నిలిస్తే.. కలిసొచ్చిన టెక్నీషియన్నేతీసుకుని ఇస్మార్ట్‌తో సక్సెస్ రిపీట్ చేశాడుపూరీ. మణిశర్మ కెరీర్‌లో చాలా సంవత్సరాల తర్వాత ఇస్మార్ట్ శంకర్‌తో మ్యూజికల్‌హిట్ పడింది. ఈ సక్సెస్ చాలాకాలం తర్వాత స్టార్ మూవీ ఆచార్యకు పని చేసే ఛాన్స్ తీసుకొచ్చింది. స్టార్ హీరోలందరూ తమన్ , దేవీశ్రీ వెనకాల పడితే.. చిరంజీవి కావాలనే మణిని రికమెండ్ చేశాడు. ఇస్మార్ట్ తర్వాత మణిశర్మ వరుస సినిమాలతో బిజీ అయినా.. సక్సెస్ పడకపోవడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. సక్సెస్ లేదు.. ఆఫర్స్ రావడం లేదు. ఈ టైంలో పూరీ ఇస్మార్ట్ సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ స్టార్ట్ చేసినా..పోస్టర్‌లో మణిశర్మ పేరు కనిపించలేదు. మ్యూజికల్ హిట్ ఇచ్చిన మణిని ఎందుకు దూరంగా పెట్టాడో అర్థంకాని పరిస్థితి. ఎట్టకేలకు ఎనౌన్స్ చేయకపోయినా.. మణిశర్మనే కంటిన్యూ చేస్తున్నాడని ఆల్రెడీ ఒక పాట రీరికార్డింగ్ కూడా పూర్తయిందని తెలిసింది. ఇస్మార్ట్‌ను మించి సీక్వెల్‌ను డబుల్ మ్యూజికల్ హిట్ చేస్తాడేమో చూడాలి మరి.