Tollywood: హిట్ హీరో ది.. ఫ్లాప్ హీరోయిన్దట పాపం

హిట్ కొడితే అవకాశాలు లేవు. ప్లాప్ అయితే సినిమా ఛాన్సులు రావు. ఈ రెండు సమస్యలతో నలిగిపోతోంది టాలీవుడ్.

  • Written By:
  • Publish Date - October 6, 2023 / 09:24 AM IST

టాలీవుడ్ లో విచిత్రమైన పరిస్థితి ఏర్పాడింది. సినిమా హిట్ అయితే ఆ క్రెడిట్ హీరోకి వెళ్లతుంది. ఫ్లాప్ అయితే ఆ భారం హీరోయిన్ మోయాల్సి వస్తోంది.ఒకటి రెండు సినిమాలు హిట్ కాకపోతే ఎంత పెద్ద బ్యూటీనైనా పక్కన పెట్టేస్తున్నారు మేకర్స్. పోనీ సాలిడ్ హిట్ తో బౌన్స్ బ్యాక్ అయినా ఆఫర్స్ ఇవ్వడం లేదు. ప్రజెంట్ ఇలాంటి ఫేజ్ లో ఇరుక్కుపోయ్యారు ఓ మూగ్గురు హాట్ బ్యూటీస్.

కేజీఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది శ్రీనిధి శెట్టి. ఈ సినిమాలో తన పెర్ఫామెన్స్ కి మంచి మార్కులు పడ్డాయి. దీంతో ఈ బ్యూటీ కెరీర్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది అనుకుంటే బ్యాడ్ టైం బాదేసింది. కేజీఎఫ్2 తర్వాత విక్రమ్ సరసన కోబ్రాలో నటించిన శ్రీనిధి తర్వాత ఒక్క సినిమా కూడా చేయలేదు. ఏ డైరెక్టర్ ఈ బ్యూటీ వైపు కన్నైతి కూడా చూడటం లేదు.

కంచె సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది ప్రగ్యా జైస్వాల్. ఆ తర్వాత ఎన్ని సినిమాల్లో నటించినా ఏవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. చాలా కాలం తర్వాత అఖండతో బౌన్స్ బ్యాక్ అయింది. ఈ సినిమా తర్వాత ప్రగ్యా ఫేట్ మారుతుంది అనుకుంటే ఒక్క ఆఫర్ కూడా తన అకౌంట్ లో పడలేదు. స్టార్ హీరోలు ఎవరు ఈ బ్యూటీని పెద్దగా పట్టించుకోవడం లేదు.

భీమ్లానాయక్ తో టాలీవుడ్ కి పరిచయమైంది సంయుక్త మీనన్. రానా తో జోడి కట్టి హిట్ అందుకుంది. తర్వాత బింబిసార లో నటిస్తే సూపర్ హిట్ పడింది. ధనుష్ సార్ తో బ్లాక్ బస్టర్ హిట్ అకౌంట్ లో పడింది. సాయితేజ్ తో కలిసి చేసిన విరూపాక్ష కూడా భారీ కలక్షన్స్ ని రాబట్టింది. అయినా సంయుక్త జోరు పెరగలేదు. ప్రజెంట్ నిఖిల్ స్వయంభూ ప్రాజెక్ట్ తప్ప మరో మూవీ తన చేతిలో లేదు. మొత్తానికి టాలీవుడ్ లో హిట్స్ ఇచ్చిన ఈ ముగ్గురికి ఇప్పటికీ సరైనా ఛాన్స్ లు రావడం లేదు.