ప్రధానిగా నరేంద్ర మోదీ (Narendra Modi) మూడవసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ చారిత్రక ఘట్టానికి రాష్ట్రపతి భవన్ (Rashtrapati Bhavan) వేదికఅయ్యింది. మరి కాసేపట్లో రాత్రి 7.30 గంటలకు మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేస్తారు. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఢిల్లీని నోఫై జోన్గా ప్రకటించి నిషేధాజ్ఞలు విధించారు. ఇవాళ రాత్రి 11 గంటల వరకు విమాన రాకపోకలను నిలిపివేశారు.
సర్వాంగ సుందరంగా.. రాష్ట్రపతి భవన్
మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ముస్తాబవుతోంది. నేడు ఢిల్లీని అధికారులు నో ఫ్లైజోన్ గా ప్రకటించారు. రాష్ట్రపతి భవన్ ప్రాంతంలో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు ఇప్పటికే పొరుగు దేశాల అధినేతలు, విదేశీ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో పాటు సామాన్యులకు ఆహ్వానాలు అందాయి. ప్రమాణ స్వీకారం తర్వాత మోదీ వారణాసి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
భారత్ చేరుతున్న విదేశీ అగ్ర నేతలు..
దీంతో ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి పొరుగు దేశాల అగ్ర నేతలను కేంద్రం ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, మారిషస్ దేశాధినేతలు రానున్నారు. ఇందులో భాగంగా మోదీ ఇప్పటికే నేపాల్ ప్రధాని ప్రచండ, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు విక్రమసింఘేను సంప్రదించారు. మరో వైపు మాల్దీవులు అధ్యక్షుడు మొయిజ్జు భారత్ చేరుకున్నారు. మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి వచ్చిన ఆయనకి విదేశాంగశాఖ ప్రతినిధి రంధర్ జైస్వాల్ స్వాగతం పలికారు.