కరోనా మహమ్మారిని సృష్టించిన దేశంగా ప్రపంచానికి పరిచయం అవ్వడమే ఇది చేసిన పాపం. ఈ పాపం ఇప్పుడు తీవ్రంగా వెంటాడుతోంది. దీంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలతో పాటూ చైనా ఆర్థిక మూలాలు దెబ్బతిన్నాయి. ఎన్నడూలేని విధంగా మూడు దశాబ్ధాల కాలంలో పెరిగిన జనాభా కూడా దీనికి ఒక కారణమే. దీని ప్రభావం ఉపాధి, ఉద్యోగ అవకాశాలపై పడింది. పైగా వృద్ధ జనాభా అధికంగా ఉంది. డిగ్రీలు చేత పట్టుకున్న యువతకు సరైన ఉపాధి లభించడంలేదు. అర కొర జీతాలకే పనిచేయాల్సి వస్తోంది. దీని కారణంగా చాలా మంది ఉద్యోగం చేసేందుకు సుముఖత చూపడంలేదు. దీంతో సగటు వ్యక్తి తలసరి ఆదాయం తగ్గిపోయింది. ఈ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థ మీద బలంగాపడింది. ఇవే కాక మరిన్ని అంశాలు చైనా ఆర్థిక పతనానికి కారణం అయ్యాయి. వాటిని ఇప్పుడు చూద్దాం.
ట్రంప్ విధించిన సుంకాలు
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చైనా గతంలో చేసిన పనులకు తీవ్రం ఆగ్రహంతో ఉన్నారు. దీనిని దిగుమతి సుంకాలపై చూపించారు. ఉన్న పన్నులకంటే అదనంగా విధించడంతో ప్రపంచ వర్క్ షాప్ గా పేరొందిన చైనా క్రమక్రమంగా క్షీణిస్తూ వచ్చింది. ఇక్కడి నుంచి వస్తువులను దిగుమతి చేసుకునే వారి సంఖ్య పూర్తిగా తగ్గింది. దీనిప్రభావం ఆదేశపు ఉత్పత్తి రంగం మీద పడింది. తద్వారా ఆర్థిక మూలాలు క్రమక్రమంగా దెబ్బతింటూ వచ్చాయి.
ఆసియా దేశాలకు తరలిపోయిన బొమ్మల కంపెనీలు
ఇలా అదనపు సంకాలు చెల్లించేందుకు సుముఖత చూపించని కొన్ని దేశాలు తమ పరిశ్రమలను మెక్సికో, అమెరికా, ఇండియా, వియత్నాంలకు తరలించి ఉత్పతి చేయడం ప్రారంభించింది. దీనిని అంతర్జాతీయ వాణిజ్య పరిణామాలను ఎప్పటికప్పుడు అంచనా వేసే ఆర్థికవేత్త మార్క్ హాప్కిన్స్ ముందుగానే గ్రహించారు. దీంతో చైనా-అమెరికా వాణిజ్య పరంగా ఉన్న సంబంధాలు బలహీనపడ్డాయి. 2019 నుంచే పిల్లలకు బొమ్మలు తయారు చేసే పరిశ్రమలు ఆసియా దేశాలకు తరివెళ్లాయి. అమెరికా చేసిన చర్యవల్ల చైనాకు రావల్సిన లాభాలను వియత్నాం, దక్షిణ కొరియా, తైవాన్, మలేసియా దేశాలు ఎత్తుకెళ్లాయి. ఇలా కూడా ఆర్థిక అనిశ్చితి తలెత్తడానికి కారణంగా చెప్పాలి.
సరైన సమయంలో రియల్ ఎస్టేట్ డెవలప్ చేయకపోవడం
కోవిడ్ సమయంలో జనాభా పెరుగుదల క్రమక్రమంగా పెరగడాన్ని గమనించిన చైనా రియల్ ఎస్టేట్ రంగాన్ని అభివృద్ది చేయాలని భావించింది. పెరిగిన జనాభాకు తగిన వసతులతో కూడిన భవనాలను నిర్మించాలని ప్రయత్నాలు చేసింది. ఇక్కడ కూడా ఎదురుదెబ్బ తగిలింది. డబ్బులు పోగుచేసుకున్న చాలా కుటుంబాలు ఇళ్లు కొనేందుకు సుముఖత చూపించిన సందర్బంలో సరైన సమయానికి ఇళ్లు వారికి అందించలేక పోయాయి రియల్ ఎస్టేట్ కంపెనీలు. దీంతో చాలా వరకూ ప్రజలు స్థిరాస్తి కొనుగోలు చేయాలన్న భావనను విరమించుకున్నారు. అప్పటికే కోట్ల రూపాయలు పెట్టుబడిపెట్టిన రియల్ ఎస్టేట్ సంస్థలకు తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. ఇలా ప్రతి ఒక్కరూ తమకు సొంత ఇల్లు అవసరం లేదనే భావనకు వచ్చేశారు. దీంతో ఇళ్లకు గిరాకీ తగ్గింది. దీని ప్రభావం రియల్ ఎస్టేట్ పై పడింది.
అప్పులు కట్టలేని పరిస్తితి
ఇళ్లు నిర్మిద్దాం అనే ఉద్దేశ్యంతో కొందరు పేరొందిన రియల్ ఎస్టేట్ సంస్థలు బ్యాంకుల వద్ద రుణాలు చేశాయి. సరైన సమయానికి ఇళ్లు కట్టివ్వని కారణంగా వినియోగదారులు తమ అభిప్రాయాన్ని మార్చుకోవడంతో బ్యాంకుల నుంచి తెచ్చిన రుణాలు నిర్మాణ రంగంలో పెట్టి ఇరుక్కు పోయారు బిల్డర్లు. తద్వారా బ్యంకులకు సకాలంలో రుణాలు కట్టే పరిస్థితి కనిపించడంలేదు. ఒకవేళ చెల్లించాల్సి వస్తే తమ సొంత డబ్బులను ఇవ్వాలి. అందుకే అక్కడి బ్యాంకులు ఇచ్చిన రుణాలు చెల్లించేంత వరకూ కొత్త రుణాలు ఇవ్వబోమని తెగేజి చెబుతున్నాయి. ప్రభుత్వాలు కూడా బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశాయి. ఇలా అన్ని దారులు మూసుకుపోయిన తరుణంలో రియల్ ఎస్టేట్ కూడా తీవ్రంగా దెబ్బతింటోంది.
ఈ పై కారణాలు అన్నీ వెరసి చైనాను ఆర్థికంగా దివాళా తీసే పరిస్థితులకు తీసుకెళ్తున్నాయని చెబుతున్నారు ఆర్థికరంగ నిపుణులు.
T.V.SRIKAR