ఫాహద్ ఫాజిల్ యాక్టింగ్‌కు కోట్లలో ఫ్యాన్స్ ఉంటారు. ఆవేశం మూవీలో ఫపా చేసిన చేసిన చిన్న సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పుష్ప మూవీతో ఫాహద్‌కు స్పెషల్ గుర్తింపు వచ్చింది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఐతే తాను అరుదైన వ్యాధి బారిన పడ్డానని ఫహద్ షాకింగ్ న్యూస్ చెప్పాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 41ఏళ్ల వయసులో తాను అరుదైన వ్యాధి బారిన పడ్డానని.. ఆ వ్యాధి చికిత్స గురించి డాక్టర్లను అడిగానని ఫహద్ చెప్పుకొచ్చాడు.
ఆ వ్యాధి పేరు అటెన్షన్ డిఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. మెదడు పనితీరు విషయంలో ఇది తీవ్ర ప్రభావం చూపుతుందట. శ్రద్ధ, ప్రేరణ, ప్రవర్తనను కంట్రోల్ చేసే కెపాసిటీని ఈ వ్యాధి ప్రభావితం చేస్తుందని.. ఫహద్ ఫాజిల్ చెప్పుకొచ్చారు. ఈ వ్యాధి పిల్లల్లో సాధారణమే అని పెద్దల్లో మాత్రం అరుదుగా వస్తుందని అన్నారు. ఈ వ్యాధి బారిన పడిన వ్యక్తుల్లో పని విషయంలో శ్రద్ధ ఉండదని.. ఈ వ్యాధి బారిన పడిన వ్యక్తులు ఇప్పటికే మొదలుపెట్టిన పనులను పూర్తి చేయకముందే కొత్త పనులను మొదలుపెడతారని చెప్పుకొచ్చాడు.
కొన్నిరోజుల క్రితం ఆవేశం సినిమాతో ఫహద్ ఫాజిల్ భారీ హిట్ ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం పుష్ప ది రూల్ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయ్. పుష్ప ది రూల్ సినిమా ఈ ఏడాది ఆగష్టు నెల 15వ తేదీన రిలీజ్ కానుంది. ఐతే లేటెస్ట్ న్యూస్ ఫహద్ ఫ్యాన్స్‌ను షాక్‌కు గురి చేసింది. ఆయన త్వరగా కోలుకోవాలని.. ఆయన కెరీర్ మరింత సక్సెస్‌ఫుల్‌గా సాగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.