భారత్,పాక్ మ్యాచ్ కు పోటెత్తిన ఫ్యాన్స్ దుబాయ్ లో సరికొత్త రికార్డ్

ప్రపంచ క్రికెట్ లో భారత్ , పాకిస్థాన్ జట్లు ఎక్కడ, ఎప్పుడు తలపడినా ఉండే క్రేజ్ గురించి అందరికీ తెలుసు... అండర్ 19 అయినా, భారత్,పాక్ ఏ జట్లు అయినా, మహిళల వరల్డ్ కప్ అయినా... హాకీలోనైనా చిరకాల ప్రత్యర్థులు ఢీకొంటున్నాయంటే ఫ్యాన్స్ లో ఎక్కడలేని జోష్ కనిపిస్తుంది.

  • Written By:
  • Publish Date - October 7, 2024 / 02:02 PM IST

ప్రపంచ క్రికెట్ లో భారత్ , పాకిస్థాన్ జట్లు ఎక్కడ, ఎప్పుడు తలపడినా ఉండే క్రేజ్ గురించి అందరికీ తెలుసు… అండర్ 19 అయినా, భారత్,పాక్ ఏ జట్లు అయినా, మహిళల వరల్డ్ కప్ అయినా… హాకీలోనైనా చిరకాల ప్రత్యర్థులు ఢీకొంటున్నాయంటే ఫ్యాన్స్ లో ఎక్కడలేని జోష్ కనిపిస్తుంది. కేవలం ఈ రెండు దేశాల అభిమానులే కాదు మిగిలిన దేశాల అభిమానులు సైతం భారత్ , పాక్ పోరుపై ఆసక్తి కనబరుస్తారు. తాజాగా ఇది మరోసారి రుజువైంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్ లో భారత్,పాకిస్థాన్ జట్టుకు రికార్డు స్థాయిలో అభిమానులు హాజరయ్యారు. మహిళల క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ఒక మ్యాచ్ కు 16 వేల మందికి పైగా ఫ్యాన్స్ స్టేడియానికి వచ్చారు. సాధారణంగానే రెండు దేశాల అభిమానుల్లో ఉండే క్రేజ్ తో పాటు వరల్డ్ కప్ చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్ తో స్టేడియం నిండిపోయింది.

దీనికి తోడు మ్యాచ్ కూడా ఆసక్తికరంగానే సాగింది. పాక్ జట్టును భారత త్వరగానే ఆలౌట్ చేసి పై చేయి సాధించినా పిచ్ స్లోగా ఉండడంతో ఛేజింగ్ సునాయాసంగా సాగలేదు. అయితే కాస్త వ్యూహాత్మకంగా ఆడిన భారత బ్యాటర్లు మాత్రం మ్యాచ్ ను గెలిచి అభిమానుల్లో జోష్ నింపారు. భారత మహిళల జట్టు వీస్ పై చిత్తుగా ఓడిపోవడంతో ఈ మ్యాచ్ లో గెలవడం ద్వారా సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. మిగిలిన రెండు మ్యాచ్ లలోనూ మంచి రన్ రేట్ తో గెలిస్తే సెమీస్ కు చేరే అవకాశముంటుంది. ఇదిలా ఉంటే ఈ సారి మహిళల ప్రపంచకప్ మ్యాచ్ లు దాదాపు అన్నీ ఆసక్తికరంగానే సాగుతున్నాయి. దీనికి కారణం స్లో పిచ్ లే…. చిన్న జట్లు సైతం తక్కువ స్కోర్లను కాపాడుకుంటుండడంతో అభిమానులు మ్యాచ్ లను ఆస్వాదిస్తున్నారు.

ఒకవిధంగా ఐసీసీ టోర్నీని సక్సెస్ చేసే క్రమంలో తొలి అడుగును విజయవంతంగా వేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఫ్లాట్ వికెట్లు రూపొందించి ఉంటే చిన్న జట్లపై టాప్ టీమ్స్ మ్యాచ్ లన్నీ వన్ సైడ్ గా మారిపోయి ఉండేవి. అలా కాకుండా ఇరు జట్లకు సమాన అవకాశాలు కల్పిస్తూ స్లో వికెట్ కే ప్రాధాన్యత ఇవ్వడంతో మ్యాచ్ లు రసవత్తరంగా సాగుతున్నాయి. స్లో పిచ్ ల కారణంగానే స్కాట్లాండ్ లాంటి చిన్న జట్టు బంగ్లాదేశ్ కు చెమటలు పట్టించింది. అలాగే పాకిస్థాన్ మహిళల జట్టు ఆసియా కప్ ఛాంపియన్స్ శ్రీలంకకు షాకిచ్చింది. ఇక సౌతాఫ్రికా, వెస్టిండీస్ కూడా మ్యాచ్ లు గెలిచినా చెమటోడ్చాల్సి వచ్చింది. ఒకవిధంగా మహిళల క్రికెట్ కు ఈ టోర్నమెంట్ మరింత ఫాలోయింగ్ పెంచుతుందని చెప్పొచ్చు.