హైదరాబాద్ లోని నాంపల్లి (Nampally Fire Accident) లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం 9.30కు భవనంలో మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు. బజార్ ఘాట్ లోని డీజిల్ మెకానిక్ గ్యారేజ్ (mechanics garage) లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. క్షాణాల్లో భవన్ మొత్తం వ్యాపించాయి. బజార్‌ఘాట్‌లో ఉన్న ఐదంతస్తుల భవనంలో 15కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. దాదాపు నాలుగు అంతస్తు వరకు మంటలు వ్యాపించడంతో ఆ ప్రాంతమంతా దట్టంగా పొగ వ్యాప్తించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు మృతి చెందారు. మంటల్లో మరి కొందరు కార్మికులు కూడా చిక్కున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి అని వారిని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. భవనంలో చిక్కుకున్న 16 మందిని భవనం నుంచి రక్షించిన ఫైర్ సిబ్బంది. ఆ ఘటన సమయంలో భవనంలో నిద్రలో ఉన్న వారు పొగలో చిక్కుకుపోయి.. నిద్రలో ఉన్న వారు ఊపిరాడక నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో ఆరు ద్విచక్రవాహనాలు, ఓ కారు కూడా పూర్తిగా దగ్ధం అయ్యాయి. భవనం కింది భాగాలలో డీజిల్ డ్రామ్స్ నిలువ చేయడంతో ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం నాలుగు ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్నారు.