వీడియోలు క్లారిటీగా తీయాలంటూ మియా ఖలీఫా ట్వీట్.. తిట్టిపోస్తున్న నెటిజన్లు..
ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధం గురించి ట్వీట్ చేసి మాజీ పోర్న్‌స్టార్ మియా ఖలీఫా వివాదంలో చిక్కకుంది. సోషల్ మీడియాలో ఆమె చేసిన పోస్ట్‌లపై దుమారం రేగుతోంది. ఇజ్రాయెల్- పాలస్తీనా యుద్ధంపై మియా ఖలీఫా స్పందిస్తూ.. ‘ఇజ్రాయెల్ లో జరుగుతున్న దాడులకు సంబంధించిన వీడియోలు సరిగా కనిపించడం లేదు. వీడియో తీసేటప్పుడు ఫోన్లను నిలువుగా కాకుండా అడ్డంగా పట్టుకొమ్మని పాలస్తీనా ఫ్రీడమ్ ఫైటర్ లో చెప్పండి.. ప్లీజ్’ అని ట్వీట్ చేసింది. కొన్ని నిమిషాల్లోనే ట్వీట్ వైరల్‌గా మారింది. దీంతో మియాను ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు నెటిజన్లు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలతో మియాతో అగ్రిమెంట్ చేసుకున్న కంపెనీలు కూడా ఆ అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేసుకుంటున్నట్టు ప్రకటించాయి.
ఈ మేరకు ప్లేబాయ్ కంపెనీ ప్రకటన విడుదల చేసింది. మరో సంస్థ టోడ్ షపిరో అనే కంపెనీ కూడా మియా ఖలీఫాతో చేసుకున్న అగ్రిమెంట్‌ను క్యాన్సిల్ చేస్తున్నట్టు ప్రకటించింది. యుద్ధంలో ఓ పక్క జనం చనిపోతుంటే ఇలా సైకోలా వీడియో క్లారిటీ గురించి మాట్లాడటం నీకే చెల్లిందంటూ నెటిజన్లు మియాకు కౌంటర్లు ఇస్తున్నారు. ఇక మియాతో అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకున్న టోడ్ షపిరో కూడా మియాకు చురకలు అంటించింది. మీ ట్వీట్ నిజంగా భయంకరంగా ఉంది.. మీరు మానవత్వం ఉన్న మనిషిగా ఎదగాలని మా కంపెనీ తరఫున కోరుకుంటున్నాం. ఇలాంటి విషాదకరమైన పరిస్థితిలో నిర్లక్ష్యపూరితమైన ట్వీట్ చేయడం కరెక్ట్ కాదంటూ ట్వీట్ చేసింది. ఇప్పుడు చేసుకున్న అగ్రిమెంట్‌ను క్యాన్సిల్ చేయడమే కాకుండా.. ఇకపై ఎలాంటి అగ్రిమెంట్ కుదుర్చుకోబోమని స్పష్టం చేసింది.
అయితే ఈ ట్వీట్లకు మియా ఖలిఫా కూడా ధీటుగా రిప్లైలు ఇస్తోంది. పాలస్తీనా కు సపోర్ట్ చేయడం వల్ల బిజినెస్ పరంగా నష్ట పోవడం కన్నా ఇలాంటి కంపెనీలతో నేను ఇంతకాలం పనిచేశాననే బాధే ఎక్కువగా ఉందని మియా ఖలీఫా మరో పోస్ట్ చేసింది. తాను లెబనాన్‌లో పుట్టి పెరిగానని, స్వాతంత్ర్యం కోసం పడే తపన ఎలా ఉంటుందో తనకు తెలుసని చెప్పింది. పాలస్తీనా పౌరులు నిజంగానే స్వాతంత్ర్య సమరయోధులని, ఆ మాటకు తాను ఎప్పటికీ కట్టుబడి ఉంటానని పోస్ట్ చేసింది. పాలస్తీనాలో పుట్టి పెరుగుతున్న వాళ్లంతా స్వాతంత్ర్యం కోసం నిత్యం పోరాడుతున్నారని చెప్పింది మియా. ఆ కారణంగానే వాళ్లను ఫ్రీడం ఫైటర్స్‌గా అభివర్ణిస్తూ ట్వీట్ చేశానంటూ వివరణ ఇచ్చింది. మియా ఎలాంటి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చినా సోషల్ మీడియా యూజర్లు మాత్రం కామెంట్ సెక్షన్‌లో మియాను ఆడుకుంటున్నారు.