Film Chamber Elections : ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు వెల్లడి.. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కొత్త అధ్యక్షుడిగా భరత్ భూషణ్…

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు నేడు HYDలో జరిగాయి. ప్రస్తుత అధ్యక్షుడు ఉన్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు పదవీకాలం ఈనెల 31తో ముగియనుంది.

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ (Telugu Film Chamber) ఎన్నికలు నేడు HYDలో జరిగాయి. ప్రస్తుత అధ్యక్షుడు ఉన్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) పదవీకాలం ఈనెల 31తో ముగియనుంది. అధ్యక్ష బరిలో ఠాగూర్ మధు, భరత్ భూషణ్.. ఉపాధ్యక్ష పదవికి అశోక్, YVS చౌదరి పోటీ చేశారు. 48 మంది ప్రొడ్యూసర్స్ (Producers), ఎగ్జిబిటర్స్ (Exhibitors), డిస్ట్రిబ్యూటర్స్, స్టూడియో సెక్టార్‌లోని సభ్యులు వీరిని ఓటు హక్కు వినియోగించి ఎన్నుకోనున్నారు.

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కొత్త అధ్యక్షుడిగా భరత్ భూషణ్…

కాగా ఈ అధ్యక్ష ఎన్నికల్లో.. విశాఖకు చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ భరత్ భూషణ్ (Bharat Bhushan) తెలుగు ఫిలిం ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈసారి ఫిలిం ఛాంబర్ అధ్యక్ష పదవికి డిస్ట్రిబ్యూటర్లు పోటీలో నిలిచారు. భరత్ భూషణ్, ఠాగూర్ మధు (నెల్లూరు) పోటీపడగా, భరత్ భూషణ్ నే విజయం వరించింది. భరత్ భూషణ్ కు 29 ఓట్లు, ఠాగూర్ మధుకు 17 ఓట్లు వచ్చాయి.

ఇక, తెలుగు ఫిలిం చాంబర్ ఉపాధ్యక్ష పదవికి కూడా నేడు ఎన్నికలు నిర్వహించగా… నిర్మాత అశోక్ కుమార్ గెలిచారు. ఉపాధ్యక్ష పదవికి అశోక్ కుమార్, వైవీఎస్ చౌదరి మధ్య పోటీ జరిగింది. అశోక్ కుమార్ కు 28 ఓట్లు, వైవీఎస్ చౌదరికి 18 ఓట్లు లభించాయి. ఈసారి డిస్ట్రిబ్యూటర్‌ రంగానికి చెందిన వారికి అవకాశం దక్కింది.

Suresh SSM