Film Stars Win: కొందరు తారలు మెరిశారు !

ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో సినీతారలు తళుక్కుమన్నారు. దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారిన మండి స్థానంలో కంగనా రనౌత్‌ విక్టరీ కొట్టింది. అయితే విరుద్‌నగర్‌ నుంచి పోటీ చేసిన రాధిక శరత్‌కుమార్‌ ఓడిపోయారు.

  • Written By:
  • Updated On - June 5, 2024 / 04:10 PM IST

ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో సినీతారలు తళుక్కుమన్నారు. దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారిన మండి స్థానంలో కంగనా రనౌత్‌ విక్టరీ కొట్టింది. అయితే విరుద్‌నగర్‌ నుంచి పోటీ చేసిన రాధిక శరత్‌కుమార్‌ ఓడిపోయారు.
దేశవ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వీళ్లల్లో కంగనా రనౌత్, హేమ మాలిని, మనోజ్ తివారి మరి కొందరు ఉన్నారు.
హిమాచల్‌ ప్రదేశ్‌లో మండి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌పై పోటీచేసి గెలిచారు.. భోజ్‌పురి నటుడు, నార్త్ ఈస్ట్‌ ఢిల్లీ బీజేపీ ఎంపీ అభ్యర్థి మనోజ్ తివారి ఘన విజయం సాధించారు. అక్కడ కాంగ్రెస్ తరపున కన్హయ్య కుమార్ పోటీ చేశారు. వెస్ట్‌ బెంగాల్‌లోని అసన్‌సోల్‌లో స్థానం నుంచి తృణమూల్ అభ్యర్థి, నటుడు శత్రఘ్ను సిన్హా గెలుపొందారు. గతంలో కేంద్రమంత్రిగానూ ఆయన పని చేశారు..
మధురలో బీజేపీ అభ్యర్థి హేమమాలిని మరోసారి గెలిచారు. 2019లోనూ ఆమె విజయం సాధించారు. యూపీలోని మీరట్‌లో బీజేపీ తరపున హిందీ సీరియల్ రామాయణ్ నటుడు అరుణో గోవిల్‌ గెలిచారు. భోజ్‌పురి యాక్టర్, బీజేపీ ఎంపీ అభ్యర్థి రవి కిషన్ గోరఖ్‌పూర్‌లో గెలిచారు. మలయాళ నటుడు సురేష్‌ గోపి.. త్రిసూర్‌లో బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించారు. దీంతో కేరళలో ఖాతా తెరిచింది బీజేపీ..
తమిళనాడులో బీజేపీ నుంచి పోటీచేసిన రాధిక శరత్‌కుమార్‌ ఓడిపోయారు. విరుధ్‌నగర్‌లో రాధికపై కాంగ్రెస్ సీనియర్ నేత మాణిక్కం ఠాగూర్‌ గెలిచారు.