Raghunandan Rao: రఘునందన్‌పై బీఆర్ఎస్‌ కేసు.. ఎందుకంటే..

మాజీ మంత్రి హరీశ్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేశారు. ఈ మేరకు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ రెండు రోజుల కింద ఫిర్యాదు చేశారు.

  • Written By:
  • Publish Date - April 3, 2024 / 02:41 PM IST

Raghunandan Rao: మెదక్‌ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుపై ఎఫ్ఐఆర్ నమోదయింది. బీఆర్ఎస్ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై కేసు పెట్టారు. మాజీ మంత్రి హరీశ్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేశారు. ఈ మేరకు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ రెండు రోజుల కింద ఫిర్యాదు చేశారు.

KTR ON PHONE TAPPING: హీరోయిన్లను బెదిరించలేదు.. ఢిల్లీకి డబ్బులు పంపడంపైనే రేవంత్ దృష్టి: కేటీఆర్

ఈసీ కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ను కలిసి కంప్లైంట్ ఇచ్చారు. తన పేరు తీస్తే గుడ్డలూడదీసి కొడతానంటూ.. మాజీ మంత్రి హరీష్‌, కొత్త ప్రభాకర్ రెడ్డి, వెంకట్రామిరెడ్డిపై రఘునందన్ కామెంట్‌ చేశారు. సంగారెడ్డి అంబేద్కర్ చౌరస్తాలో పండబెట్టి తొక్కుతానంటూ వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికలయ్యేంత వరకు రఘునందన్ అనే పేరు తీయొద్దంటూ చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీ క్రియేట్‌ చేశాయ్. ఈ మాటలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి పోటీ చేసిన రఘునందన్‌.. కొత్త ప్రభాకర్ మీద ఓడిపోయారు. ప్రస్తుతం మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు.

ఇక కాంగ్రెస్‌ నుంచి నీలం మధు ముదిరాజ్‌, బీఆర్ఎస్ నుంచి మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక అటు తెలంగాణలో కలకలం రేపుతున్న ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంపై కూడా రఘునందన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్ కూడా హ్యాక్ అయిందని ఆరోపించారు. ట్యాపింగ్​ కేసులో కేసీఆర్​ మొదటి ముద్దాయిగా, హరీశ్ రావును రెండో ముద్దాయిగా చేర్చాలంటూ రఘునందన్‌ రావు డిమాండ్​ చేశారు.