కుంభమేళాకు సర్వం సిద్ధమైంది. ప్రయాగ్‌రాజ్‌లో ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. 2025 జనవరిలో జరగబోయే.. ఈ కుంభమేళాకు వచ్చిన వారికి మంచి అనుభూతిని కలిగించేలా… ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. భక్తులపై పూలవర్షం కురిపించేందుకు హెలికాప్టర్లు కూడా సిద్ధం చేశారు. ఇది ఒక్కటే కాదు.. ఇంకా చాలా ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. అవేంటో చూద్దాం.
కుంభమేళా… 12ఏళ్లకు ఒకసారి జరిగే హిందువుల వేడుక. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా ఘనంగా జరగనుంది. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోతున్నాయి. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా… చర్యలు చేపడుతున్నారు. అంతేకాదు… ఈసారి జరిగే కుంభమేళా… భక్తుల మదిలో నిలిచిపోవాలని ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తోంది యోగి సర్కార్. అందులో ఒకటి భక్తులపై పూల వర్షం కురిపించడం.
కుంభమేళాలో పూలవర్షం కురిపించడం… ఒక అద్భుతం. ఆధ్యాత్మిక కార్యక్రమంలో… భక్తులను ఆనందపరిచే సంబురం. కుంభమేళా వైభవాన్ని, దివ్యత్వాన్ని మరింతగా పెంచే ప్రయత్నం. ఇందుకు సర్వం సిద్ధం చేస్తోంది యూపీ ప్రభుత్వం. భక్తులు, సాధువులపై పూలవర్షం కురిపించేందుకు హెలికాప్టర్లను కూడా సిద్ధం చేసింది. గంగ, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమ క్షేత్రంలో.. భక్తులు స్నానమాచరిస్తుండగా… హెలికాప్టర్ల పైనుంచి పూల వర్షం కురిసేలా ప్లాన్ చేస్తోంది. ఇది.. భక్తులకు మరపురాని అనుభూతిగా మిగిలిపోతుందని భావిస్తున్నారు.
మతపరమైన కార్యక్రమాల్లో పూలవర్షం కురిపించడం యోగి ప్రభుత్వం ఆనవాయితీగా నిర్వహిస్తోంది. ఇప్పటికే ఎన్నో మతపరమైన యాత్రల సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టింది. అయితే… 12ఏళ్లకు ఒకసారి జరిగే మహా కుంభమేళా… అతిపెద్ద కార్యక్రమం. ఈ జాతరకు లక్షల్లో భక్తులు తరలివస్తారు. అందరిపై పూలవర్షం కురిపించడం అంటే… కాస్త కష్టమే. అయినా… తగ్గేదేలే అంటోంది యూపీ సర్కార్. భక్తులపై పూలవర్షం కురిపించి తీరుతామని చెప్తోంది. అందుకు సరిపోయే హెలికాప్టర్లను కూడా ఇప్పటికే సిద్ధం చేసింది. త్రివేణి సంగమంతోపాటు… ప్రధాన ఘాట్‌ల దగ్గర పూలవర్షం కురిపించేందుకు… ప్లాన్ రెడీ చేసింది. కుంభమేళాకు వచ్చిన భక్తులు… ఏ ఘాట్ దగ్గర ఉన్నా… ఆకాశంపై నుంచి వర్షం కురిసినట్టు… హెలికాప్టర్ల నుంచి పూలవర్షం కురవనుంది. మరిచిపోలేని మంచి అనుభూతిని మిగల్చనుంది.
ఇక.. కుంభమేళాకు వచ్చే భక్తుల భద్రతపై కూడా ఫోకస్ పెట్టారు. అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. అనుకోని ప్రమాదాలు జరిగితే రక్షించేందుకు రోబోలు అవేనండి.. రోబోటిక్ ఫైర్ టెండర్లను కూడా రంగంలోకి దించుతున్నారు. ఇక… శుచి శుభ్రత విషయంలోనూ ఏ పొరపాట్లు జరగకుండా… ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా జరుగుతున్న ప్రాంతాన్ని కొత్త జిల్లాగా ప్రకటించింది యూపీ ప్రభుత్వం. ఆ జిల్లాకు.. మహాకుంభమేళా జిల్లాగా పేరుపెట్టింది. దాన్ని… రాష్ట్రంలోని 76వ జిల్లాగా ప్రకటించింది. కుంభమేళాను.. సజావుగా నిర్వహించేందుకు, పరిపాలనా పనులను మరింత మెరుగ్గా నిర్వహించేందుకు… కొత్త జిల్లా ఏర్పాటు చేసినట్టు ప్రకటించింది.