Epuri Somanna: సాంస్కృతిక కళాకారుడు, ఫోక్ సింగర్ ఏపూరి సోమన్నా మళ్లీ పార్టీ మారారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణలో కొత్త ప్రభత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌లో తన పాత రాజకీయ జీవితాన్ని మరోసారి కొత్తగా మొదలుపెట్టాడు. ఏపూరి సోమన్న పార్టీ మారడంపై పాజిటివ్ కంటే నెగటివ్ కామెంట్లే ఎక్కువగా వస్తున్నాయి. సాంస్కృతిక కళాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఏపూరి రాజకీయాల్లో కూడా యాక్టివ్‌గా ఉంటూ వచ్చారు.
RENU DESAI: ఎలక్షన్ టైమ్‌లో ఆ టాటూ.. పవన్‌కు రేణుదేశాయ్ ఏం చెప్పాలనుకుంటోంది..?
తన సొంత నియోజకవర్గం తుంగతుర్తి నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రత్యేక తెలంగాణగా ఏర్పడిన తరువాత.. తెలంగాణ ఆశయాలు నెరవేరలేదంటూ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత రేవంత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు. కొంత కాలం కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పని చేశారు. ఎక్కడ కాంగ్రెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేసినా.. అక్కడ ఏపూరి పాటలు ఉండాల్సిందే.. ఆ పాటల్లో కేసీఆర్ కుటుంబాన్ని వేసుకోవాల్సిందే. అలాంటి సోమన్న కాంగ్రెస్‌లో తనకు టికెట్ రాదు అని కన్ఫాం అవ్వడంతో కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టడంతో ఆమె పార్టీలో చేరారు. చాలా కాలం షర్మిలకు రైట్ హ్యాండ్‌గా తెలంగాణలో వ్యవహరించారు. కొన్ని రోజులకు ఎన్నికలు సమీపించాయి. బ్యాగ్రౌండ్‌లో ఏం జరిగిందో తెలియదు కానీ నేరుగా వెళ్లి బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.
YS SHARMILA: మద్యపాన నిషేధం అంటే ప్రభుత్వమే మద్యం అమ్మడమా..?: వైఎస్ షర్మిల
ఏ వ్యక్తిని తిడుతూ పాటలు పాడాడో, ఏ కుటుంబాన్ని దొంగలు అని చెప్తూ ప్రదర్శనలు ఇచ్చారో వాళ్ల చేతుల మీదుగానే కండువా కప్పుకుని గులాబీ సైన్యంలో చేరారు. సీన్ కట్ చేస్తే ఎన్నికల్లో పరిస్థితి తారుమారు అయ్యింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో ఏపూరి సైలెంట్ అయ్యారు. ఇప్పుడ సడెన్‌గా మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో ఏందిది సోమన్నా.. ఎన్నిసార్లు పార్టీ మారుతావ్ అంటున్నారు ఆయనను అభిమానించేవాళ్లు. తెలంగాణలో పాటలకు ఎలాంటి ప్రత్యేకత ఉంటుందో సపరేట్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోను ఏపూరి పాటలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. చాలా మంది గద్దర్ తరువాత అలా పాటలుపాడే వ్యక్తిగా ఏపూరిని అభిమానిస్తారు. అలాంటి వ్యక్తి ఇన్నిసార్లు పార్టీలు మారడం బాలేదంటున్నారు ఏపూరి ఫ్యాన్స్.
ఎక్కడో ఒక చోట నిలకడగా ఉంటే ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్‌లో అయినా పొలిటికల్‌గా కలిసివచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇలా ఆరు నెలలకు ఒకసారి పార్టీలు మారుస్తుంటే నీ పక్కన ఉండేవాళ్లు కూడా నిన్ను నమ్మరు అంటున్నారు. ఇలా రాజకీయాల్లో కండువాలు మారుస్తూ కళాకారుడిగా తెచ్చుకున్న పేరు కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు.