BSP party : ట్రాన్స్‌ జెండర్‌కు ఎమ్మెల్యే టికెట్‌.. ఇది కదా మార్పు అంటే..

సమాజంలో వాళ్లంటే అందరికీ చిన్న చూపే. సెక్స్‌ వర్క్‌ కోసమో, బిక్షాటన కోసమో తప్ప వాళ్లకంటే ఓ ఉపాధి ఉండాలని కోరుకునేవాళ్లు చాలా తక్కువ. కానీ రాను రాను వాళ్ళ బతుకులు బాగు పడుతున్నాయి. ఉద్యోగాలు చేయడమే కాదు.. రాజ్యాన్ని ఏలేందుకు కూడా రెడీ అవుతున్నారు ట్రాన్స్‌ జెండర్‌.

మంచో చెడో.. సమాజంలో ఆడ మగ ఇద్దరికీ తగిన గౌరవం ఉంటుంది. చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి సంపాదనను బట్టీ ఎంత గౌరవం దక్కాలో అంత దక్కుతూనే ఉంటుంది. కానీ ఎంత టాలెంట్‌ ఉన్నా మంచి మనసు ఉన్నా గుర్తింపుకు నోచుకోని వర్గం ట్రాన్స్‌ జెండర్స్‌.  దేవుడు ఇచ్చిన శాపంతో సామాన్య జీవితానికి దూరంగా బతుకుతుంటారు. సమాజంలో వాళ్లంటే అందరికీ చిన్న చూపే. సెక్స్‌ వర్క్‌ కోసమో, బిక్షాటన కోసమో తప్ప వాళ్లకంటే ఓ ఉపాధి ఉండాలని కోరుకునేవాళ్లు చాలా తక్కువ. కానీ రాను రాను వాళ్ళ బతుకులు బాగు పడుతున్నాయి. ఉద్యోగాలు చేయడమే కాదు.. రాజ్యాన్ని ఏలేందుకు కూడా రెడీ అవుతున్నారు ట్రాన్స్‌ జెండర్‌. రీసెంట్‌గా బహుజన సమాజ్‌ పార్టీ రిలీజ్‌ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థుల్లో ఓ ట్రాన్స్‌ జెండర్‌కు అభ్యర్థిగా అవకాశమిచ్చారు.

బీఆర్‌ఎస్‌కు మంచి పట్టు ఉన్న ఉమ్మడి వరంగల్‌ జిల్లా వరంగల్‌ ఈస్ట్‌ నుంచి చిత్రపు పుష్పితను బీఎస్పీ తరఫున బరిలో దింపుతున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ప్రకటించారు. ఆగ మగ కన్నా ట్రాన్స్‌ జెండర్‌లు తక్కువ కాదు అని నిరూపించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీఎస్పీ వర్గాలు చెప్తున్నాయి. బీఎస్పీ నిర్ణయంలో ట్రాన్స్‌ కమ్యూనిటీలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇక రీసెంట్‌గానే ట్రాన్స్‌ జెండర్లకు ఓటుహక్కు కల్పించేందుకు ఈవీఎం మెషీన్లలో వారికి సపరేట్‌ కాలమ్‌ను ఏర్పాటు చేసింది ఎలక్షన్‌ కమిషన్‌. ఓటర్‌ లిస్ట్‌లో కూడా స్త్రీ,పురుషులతో పాటు ట్రాన్స్‌ జెండర్ల వివరాలు కూడా చేర్చడం మొదలుపెట్టింది. రాష్ట్రంలో ఏ పార్టీ ట్రాన్స్‌ జెండర్లకు టికెట్‌ ఇవ్వని తరుణంలో బీఎస్పీ తమ అభ్యర్థిగా ట్రాన్స్‌ జెండర్‌ను ప్రకటించడం రాష్ట్రవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది. తన నియోజకవర్గంలో పుష్పిత ఇప్పటికే ప్రచారాన్ని కూడా మొదలుపెట్టారు. ఇక ఎన్నికల్లో ప్రజల నుంచి ఆమెకు ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.