Ponnala Lakshmaiah : ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు భారీ ఝలక్‌.. హస్తానికి పొన్నాల గుడ్‌ బై..

తెలంగాణ ఎన్నికల వేళ.. రాజకీయాలు సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపిస్తున్నాయ్. ఇవాళ ఆ వైపు ఉన్న నాయకుడు.. రేపు ఏ వైపు ఉంటారో అర్థం కాని పరిస్థితి. ఊహకు అందని ట్విస్టులు.. ఊహించలేని జంపింగ్‌లు.. మాములుగా లేదు తెలంగాణ రాజకీయం. బీఆర్ఎస్‌లో అసంతృప్త నేతలంతా గాంధీభవన్ వైపు చూస్తుంటే.. హస్తం పార్టీలో ఇబ్బంది పడుతున్న నేతలంతా కారు కనిపిస్తే చాలు లిఫ్ట్ అడుగుతున్నారు.

తెలంగాణ ఎన్నికల వేళ.. రాజకీయాలు సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపిస్తున్నాయ్. ఇవాళ ఆ వైపు ఉన్న నాయకుడు.. రేపు ఏ వైపు ఉంటారో అర్థం కాని పరిస్థితి. ఊహకు అందని ట్విస్టులు.. ఊహించలేని జంపింగ్‌లు.. మాములుగా లేదు తెలంగాణ రాజకీయం. బీఆర్ఎస్‌లో అసంతృప్త నేతలంతా గాంధీభవన్ వైపు చూస్తుంటే.. హస్తం పార్టీలో ఇబ్బంది పడుతున్న నేతలంతా కారు కనిపిస్తే చాలు లిఫ్ట్ అడుగుతున్నారు. అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు.. మాములుగా లేవు జంపింగ్స్. బీఆర్ఎస్‌కు చెందిన కీలక నేతలు కొందరు ఇప్పటికే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా.. కాంగ్రెస్‌ అసంతృప్తులకు కారు పార్టీ గాలం వేస్తోంది.

ఇలాంటి పరిస్థితుల మధ్య ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ కాంగ్రెస్ మాజీ చీఫ్‌.. పొన్నాల లక్ష్మయ్య హస్తం పార్టీకి గుడ్‌ బై చెప్పారు. బీఆర్ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ కేబినెట్‌లో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన పొన్నాల.. రాష్ట్ర విభజన తర్వాత జనగామ నుంచి రెండుసార్లు పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కాంగ్రెస్‌కు తొలి పీసీసీ చీఫ్‌గా పనిచేశారు. ఈ పదవి అందుకున్న బీసీ నేతగా రికార్డ్ క్రియేట్ చేశారు. కట్‌ చేస్తే పదేళ్లలో పొన్నాల సీన్ మారింది. సొంత పార్టీలోనే ప్రాధాన్యత తగ్గిందనే ప్రచారం జరుగుతోంది. ఈసారి జనగామ టికెట్ తనకు కాకుండా వేరే వాళ్లకు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధం అవుతుందనే ప్రచారం జరుగుతోంది.

దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన పొన్నాల.. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. పార్టీ నుంచి వెళ్తూ వెళ్తూ.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు పొన్నాల లేఖ రాశారు. సొంత పార్టీలోనే తనకు తీవ్ర అవమానాలు ఎదురయ్యాయని ఆ లేఖలో రాసినట్లు తెలుస్తోంది. ఇక అటు జనగామ నుంచి పొన్నాల స్థానంలో కొమ్మూరి ప్రతాప్‌ రెడ్డికి టికెట్‌ కన్ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇక కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన పొన్నాలకు కారు పార్టీ రెడ్‌ కార్పెట్ వెల్‌కమ్ చెప్పేందుకు సిద్ధం అయింది. ఆయన సీనియారిటీని వాడుకునేందుకు సిద్ధం అవుతోంది. పార్టీలో మంచి ప్రాధాన్యత కల్పించడమే కాదు.. భవిష్యత్‌లో పదవి కూడా ఇచ్చేందుకు బీఆర్ఎస్ సిద్ధం అయిందని తెలుస్తోంది.