HMDA Sivabalakrishna : 31 ఐఫోన్లు, 150వాచ్‌లు.. 500కోట్ల ఆస్తులు ఏసీబీకే మతిపోతోంది…

హైదరాబాద్‌ (Hyderabad)లో అవినీతి అనకొండ కూడబెట్టిన అక్రమాస్తులు జాబితా చూసి.. ఏసీబీ (ACB) అధికారులే అవాక్కయ్యారు. HMDA మాజీ డైరెక్టర్‌, రెరా సెక్రటరీ (RERA Secretary) శివబాలకృష్ణ (Sivabalakrishna) ఇళ్లల్లో కనిపించిన ప్రాపర్టీస్‌ డాక్యుమెంట్లు, వాచ్‌లు, ఐఫోన్లు, ట్యాబ్‌లు చూసి నోరెళ్లబెట్టారు.

హైదరాబాద్‌ (Hyderabad)లో అవినీతి అనకొండ కూడబెట్టిన అక్రమాస్తులు జాబితా చూసి.. ఏసీబీ (ACB) అధికారులే అవాక్కయ్యారు. HMDA మాజీ డైరెక్టర్‌, రెరా సెక్రటరీ (RERA Secretary) శివబాలకృష్ణ (Sivabalakrishna) ఇళ్లల్లో కనిపించిన ప్రాపర్టీస్‌ డాక్యుమెంట్లు, వాచ్‌లు, ఐఫోన్లు, ట్యాబ్‌లు చూసి నోరెళ్లబెట్టారు. రిమాండ్‌ రిపోర్టులో ప్రస్తావించిన ఐటమ్స్‌ లిస్ట్‌ చూస్తే… ఆ లంచగొండి ఏ స్థాయిలో అక్రమార్జన చేశాడో అర్థమైపోతోంది. మరికొంతమంది బినామీలను ప్రశ్నిస్తే… ఆదాయానికి మించి కూడబెట్టిన ఆస్తుల జాబితా మరింత పెరగడం ఖాయం. శివబాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు ప్రస్తావించింది ఏసీబీ. అక్రమార్జన, అక్రమాస్తులకు సంబంధించి 45పేజీల నివేదికను నాంపల్లి కోర్టుకు సమర్పించింది.

శివబాలకృష్ణ, ఆయన కుటుంబసభ్యులతో పాటు బినామీల పేర్ల మీద విల్లాలు.. ప్లాట్లు రిజిస్ట్రేషన్‌ చేసినట్లు ఏసీబీ తేల్చింది. మొత్తం 18ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు.. 50 ప్రాపర్టీస్ డాక్యుమెంట్లు, 90ఎకరాల భూమి పత్రాలను సీజ్‌ చేశారు. వీటి విలువ డాక్యుమెంట్ల ప్రకారం 5 కోట్లు ఉంటుంది. బహిరంగ మార్కెట్‌లో పది రెట్లు ఎక్కువ.. అంటే 5వందల కోట్లు ఉంటుంది. ఇవే కాకుండా 99 లక్షల రూపాయల నగదు, ఖరీదైన నాలుగు కార్లు, భారీగా బంగారు ఆభరణాలను సీజ్‌ చేసింది. బ్యాంక్‌ బాలెన్స్ 58 లక్షల రూపాయలను ఫ్రీజ్‌ చేసింది. ఇంపోర్టెడ్‌ వాచ్‌లు, ఐఫోన్లు, గృహోపకరణాల విలువ 8కోట్ల 26 లక్షలుగా ఏసీబీ అధికారులు అంచనా వేశారు. ఇంకా నలుగురు బినామీలను విచారించాల్సి ఉందని, ఇతర అధికారుల పాత్రపై దర్యాప్తు జరపాల్సి ఉందని ఏసీబీ అధికారులు కోర్టుకు తెలిపారు.

అవినీతి అనకొండలకే అనకొండ అనే రేంజ్‌లో శివబాలకృష్ణ అక్రమంగా ఆస్తులను ఈజీగా కొనేశాడు. బంగారు ఆభరణాలు, ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లు, కాస్ట్‌లీ వాచ్‌లు చూస్తే… అసలు ఒక ఫ్యామిలీకి ఇన్ని అవసరమా అనిపించకుండా ఉండదు. ఐఫోన్లు, ఐపాడ్‌లు, ట్యాబ్‌లు… అర డజనో, డజనో కాదు.. ఏకంగా ఓ షాప్‌ను తలపించాయ్. ఇవి చూస్తే చాలు… ఏ రేంజ్‌లో సంపాదించాడో అర్థమైపోతుంది. ఇంట్లో లభ్యమైన ఎలక్ట్రానిక్‌ డివైజ్‌ల జాబితా కూడా పెద్దగానే ఉంది. 30కి పైగా ఐఫోన్లు ఉన్నాయ్‌. 31ట్యాబ్‌లు ఉన్నాయ్‌. ఇవన్నీ అల్లాటప్పా కంపెనీలవి కావు. ఆపిల్‌ కంపెనీవి! మరోవైపు ఏకంగా 120ఇంటర్నేషనల్‌ బ్రాండ్‌ వాచ్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో గోల్డ్‌, సిల్వర్‌ వాచీలే ఎక్కువ. ప్లాటినం కోటెడ్ వాచ్‌లూ ఉన్నాయ్‌.

ఇవన్నీ రోలెక్స్, రాడో, ఫాసిల్, టిస్సాట్ లాంటి ఖరీదైన కంపెనీలవే. వీటి విలువ 32లక్షల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా. బీరువాలు తెరిచి చూస్తే నిండా పట్టుచీరలే కనిపించాయి ఏసీబీ అధికారులకు. వాటిని లెక్కించుకుంటూ వెళితే.. 2వందలకు పైనే ఉన్నాయ్‌. హైదరాబాద్‌ శివార్లలో గతేడాది ఎకరం భూమి కనీసం మూడు కోట్లు పలికింది. ఐతే కేవలం లక్ష రూపాయలకే వీటిని కొన్నట్లు డాక్యుమెంట్లలో చూపించాడు బాలకృష్ణ. నాగర్‌కర్నూల్‌లో 12 ఎకరాలను గుర్తిస్తే… చేవెళ్ల, అబ్దుల్లాపూర్‌మెట్, శేరిలింగంపల్లి, భువనగిరి, యాదాద్రి, జనగాం, సిద్దిపేట, గజ్వేల్‌లో విలువైన భూములు, ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది ఏసీబీ. పుప్పాలగూడ ఆదిత్య ఫోర్ట్ వ్యూలో విల్లా హౌజ్.. సోమాజిగూడ లెజెండ్ తులిప్స్‌లో ఫ్లాట్ ఉన్నట్లు గుర్తించింది ఏసీబీ. మొత్తం నాలుగు పాస్‌బుక్‌లు, 20 ఎల్‌ఐసీ పాలసీ బాండ్లు, ఐటీ రిటర్న్‌ డాక్యుమెంట్లను సీజ్‌ చేసింది. శివబాలకృష్ణ అక్రమాస్తులపై విచారణకు నాలుగు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయ్. లేఅవుట్‌ అనుమతుల కోసం శివబాలకృష్ణ భారీగా లంచాలు తీసుకున్నారని… అప్లికేషన్‌లో తప్పులు ఉన్నాయని మభ్యపెట్టి అందినకాడికి వసూళ్లు చేశారని ఏసీబీ అధికారులు గుర్తించారు.

లంచాలుగా పొందిన విల్లాలను… తన బినామీల పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించినట్లు గుర్తించారు. HMDA ఆఫీసులోని ఐదో అంతస్థులో కొద్దిమందికి మాత్రమే ప్రవేశం ఉండేదని.. శివబాలకృష్ణకు 30మంది అధికారులు సహకరించారని తెలుస్తోంది. అవినీతి అనకొండ శివబాలకృష్ణను కస్టడీలోకి తీసుకున్నాక… బ్యాంక్‌ లాకర్లు ఓపెన్‌ చేస్తారు. అప్పుడు ఇంకెంత బయటపడుతుందో చూడాలి. ఈ ఆస్తులు, వస్తువులను తలుచుకుంటేనే గుండె గుభేల్‌మంటోంది కదా.. అంతే మరి.. ఇది అలాంటి ఇలాంటి అవినీతి అనకొండ కాదు.. అవినీతి అనకొండలను మింగిన అనకొండ మరి!