ప్రజలు ఛీ కొట్టారు.. పార్టీ నేతలు ఒంటరిని చేశారు… సొంత అనుచరులు తమ దారి తమదే అన్నారు. ఈ సమయంలో ఫైర్ బ్రాండ్ రోజా దారెటు… చిత్తూరు జిల్లాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఐదేళ్ళుగా ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఆమె… ఓటమి తరువాత కనిపించకుండా పోయింది. దీంతో వాట్ నెక్ట్స్ అనే చర్చ జోరుగా జరుగుతోంది. మళ్ళీ మొహానికి రంగులు వేస్తుందా… బుల్లితెరపై జబర్దస్త్ లో తళుక్కుమంటుందా. అది సాధ్యం కాకపోతే రాజకీయ సన్యాసమేనా… రోజా ఆడుగులు ఎటువైపు ?
తెలుగు రాజకీయాల్లో నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అంటే ఫైర్.., ఫైర్ అంటే రోజా. ప్రత్యర్థులపై ఆమె చేసే విమర్శలు అంత ఘాటుగా ఉంటాయి. ఏ అంశంలోనైనా ప్రత్యర్థుల్ని ఏకిపారేయడం రోజా స్టైల్. రెండోసారి ఎమ్మెల్యే అయ్యాక… మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో తీవ్రస్థాయిలో అలకబూనింది. దాంతో సీఎం జగన్ ఆమెకు కీలకమైన APIIC చైర్మన్ పోస్ట్… ఆ తరువాత పర్యాటక శాఖ మంత్రి పదవి ఇచ్చారు. చంద్రబాబు నుంచి పవన్ కళ్యాణ్, లోకేశ్ వరకూ విపక్ష నేతలందరిని తన మాటల తూటలతో ఓ ఆట ఆడేసిన రోజాకి… ఇప్పుడు బొమ్మ రివర్స్ కనపడుతోందని టాక్. టిడిపి అభ్యర్ధి గాలి భాను ప్రకాష్ చేతిలో 45 వేల ఓట్లతో దారుణంగా ఓడిపోయింది రోజా… ఇన్నాళ్ళూ పార్టీ నేతలపై, లోకల్ లీడర్లపై నోరు పారేసుకోవడానికి టైమ్ కేటాయించిన రోజా… నియోజకవర్గ అభివృద్ధి, సమస్యలపై దృష్టి పెట్టకపోగా.. సొంత ఆదాయం పెంచుకుందనే విమర్శలు తీవ్రస్ధాయిలో వచ్చాయి. ఆమె యాక్టివ్ గా ఉన్న సమయంలో చక్రం తిప్పిన టీడీపీ నేత గాలి భాను ప్రకాష్ … చాపకింద నీరులా ఊహించని రాజకీయ వ్యూహాన్ని నగరిలో అమలు చేసి.. రోజాను చావు దెబ్బ కొట్టారు. అధికారంలొ ఉన్నామని ధీమాతో పార్టీ నేతలపై కక్ష రాజకీయాలు చేయడంతో సొంత పార్టీ నేతలే ఆమెకు వ్యతిరేకంగా పనిచేశారు. ఇదే సమయంలో అసంతృప్తి నేతలందర్నీ తమ గేమ్ ప్లాన్ లో భాగంగా ఎన్నికల ముందు టీడీపీలో చేర్చుకుని రోజా ఓటమిని ఎన్నికలకు ముందే కన్ఫామ్ చేశారు భాను ప్రకాష్…
2014,19లో స్వల్ప ఓట్లతో గెలిచిన రోజాకు ఈసారి మాస్టర్ స్ట్రోక్ ఇస్తూ నగరి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గెలుపొందారు భాను ప్రకాష్. దీంతో వాట్ నెక్ట్స్ అని ఆలోచన పడ్డారు ఫైర్ బ్రాండ్. ఇటు ప్రజలు నో చెప్పడం …పార్టీ నేతలు ఛీ కొట్టి వెళ్ళిపోయారు. పార్టీలో ఉన్న నేతలు నగరికి పట్టిన శని వదిలిపోయిందనీ… ఇక సినిమాలకు కూడా రోజా పనికిరాదంటూ విమర్శిస్తున్నారు. పార్టీ పెద్దలు కూడా ఆమెపై గుర్రుగా ఉన్నారట. పెద్దిరెడ్డి, నారాయణ స్వామి లాంటి నేతలతో ఆమెకు మొదటి నుంచి గొడవలు ఉన్నాయి. దానికి తోడు టిడిపి అభ్యర్ది భాను ప్రకాష్ పై ఎన్నికల ముందు కర్రలు, రాడ్స్ తో దాడి చేయడం, వాహనాలు ధ్వంసం లాంటివి రోజా అనుచరులు చేయడంతో కసితో రగిలిపోతున్నారట తెలుగు తమ్ముళ్ళు. దానికి తోడు ఎన్నికల ప్రచార సమయంలో భాను ప్రకాష్ భవిష్యత్తు నేను చూసుకుంటానని చంద్రబాబు చెప్పారు. దాంతో భాను ప్రకాష్ కి కీలక పదవి వస్తుందని ఆశిస్తున్నారు. నగరిలో గెలిచిన వారికి మంత్రి పదవులు ఇవ్వడం అనేది పార్టీలకు సెంటిమెంట్ గా వస్తోంది. అలా కాకపోయినా రోజా ఢీకొట్టిన నేతగా భాను ప్రకాశ్ కి టాప్ ప్రియారిటీ ఉంటుందని లెక్కలు వేస్తున్నారు టీడీపీనేతలు.
రోజా, ఆమె అన్నదమ్ములు చేసిన అక్రమాలు, భూ కబ్జాలు, దౌర్జన్యాలు, అన్యాయాలతో దోచుకున్న కోట్లాది రూపాయల భూములపై విచారణ జరిపిస్తామని గెలిచిన తర్వాత భాను ప్రకాష్ చేసిన కామెంట్స్ తో… రోజా అనుచరుల్లో గుబులు రేపుతోంది. ఇలా ఇంటా బయటా రోజాపై సమస్యలు చుట్టు ముడుతుండటంతో… ఫలితాల తరువాత రోజా సైలెంట్ అయ్యారట. ఎవర్నీ కలవడానికి కూడా ఇష్టపడలేదనే టాక్ నడుస్తోంది. రోజా మళ్ళీ పోరాటం చేస్తారని కొందరు అనుచరులు అంటుంటే… అంత సీన్ లేదనే కౌంటర్ టీడీపీ నుంచి వస్తోంది. మళ్ళీ ఆమె సినిమాల్లో బిజీ అవుతారని కొందరు… బుల్లితెరపై జబర్దస్త్ కి వెళతారని మరికొందరు… లేదు అసలు రాజకీయ సన్యాసం తీసుకుంటారని కూడా నగరిలో హాట్ హాట్ డిస్కషన్ నడుస్తోంది. కానీ రోజా కొన్నాళ్ళు చెన్నైకి వెళతారని సన్నిహితులు చెబుతున్నారు. ఐదేళ్ళుగా ప్రత్యర్థి నేతలను ఓ ఆట ఆడుకున్న రోజాకు ఒక్క ఓటమితో సీన్ రివర్స్ అయిందన్న కామెంట్స్ తో ఆమె అనుచరులు ఢీలా పడ్డారు. ఇంకా ముందు ఉంది ముసళ్ళ పండగా అంటున్నారు టిడిపి నేతలు. ఈ టైమ్ లో రోజా నెక్ట్స్ స్టెప్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది.