Telangana Assembly Elections : ఎన్నికల ప్రచార బరిలోకి గులాబీ దళపతి.. 17 రోజులు.. 42 సభలు

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే విపక్షాలకు అందనంత దూరం దూసుకుపోయిన బీఆర్ఎస్. గులాబీ దళపతి.. సీఎం కేసీఆర్ కు ఆరోగ్యం సహకరించక ప్రగతి భవన్ నుంచే ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాడని చెప్పవచ్చు. ఒకవైపు కేసీఆర్ మరోవైపు హరీష్ రావు.. గులాబీ బాస్ ఆదేశాలతో ఇద్దరు తెలంగాణలో సూడిగాలి పర్యటనలు చేస్తున్నారు. గత యేడాది ప్రగతి నివేదన సభకు తెలంగాణ వ్యాప్తంగా భారీ బహిరంగ సభలు నిర్వహించి 2018 లో రెండో సారి అధికార పగ్గాలు పట్టారు కేసీఆర్.

ఈ నెల 15 నుంచే బీఆర్‌ఎస్‌ సీఎం కేసీఆర్ ఎన్నికల సమర శంఖారావం పూరించనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొదటి విడత ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ రిలిజ్ చేశారు. గత ఎన్నికలు కూడా 2014, 2018లో ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి నుంచే గులాబీ బాస్ ప్రారంభించారు. అదే మాదిరిగా ఈ సారి 100 సీట్లు గురిపెట్టి.. మూడోసారీ హుస్నాబాద్ నుంచే 15న సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభతో మొదలు పెట్టి 17 రోజులు 42 సభలు.. నిర్వహించనున్నారు. ఇదే సభలో బీఆర్ఎస్ పథకాలపై ప్రసంగం చేసి నూతన మేనిఫెస్టో కూడా కేసీఆర్ ప్రకటించనున్నారు.

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే విపక్షాలకు అందనంత దూరం దూసుకుపోయిన బీఆర్ఎస్. గులాబీ దళపతి.. సీఎం కేసీఆర్ కు ఆరోగ్యం సహకరించక ప్రగతి భవన్ నుంచే ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాడని చెప్పవచ్చు. ఒకవైపు కేసీఆర్ మరోవైపు హరీష్ రావు.. గులాబీ బాస్ ఆదేశాలతో ఇద్దరు తెలంగాణలో సూడిగాలి పర్యటనలు చేస్తున్నారు. గత యేడాది ప్రగతి నివేదన సభకు తెలంగాణ వ్యాప్తంగా భారీ బహిరంగ సభలు నిర్వహించి 2018 లో రెండో సారి అధికార పగ్గాలు పట్టారు కేసీఆర్.

ఇదే తరహాలో ఈ సారి కూడా 17 రోజులు.. 42 సభలలో తెలంగాణ వ్యాప్తంగా సభలు 119 నియోజకవర్గాలు కేంద్రికృతం చేసి భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. దానికి తగ్గాటుగా సీఎం కేసీఆర్ ఎన్నికల టూర్ షెడ్యూల్ కూడా విడుదల చేశారు. ఈ నెల 15న దసరా నవరాత్రుల ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అదే రోజు నుంచి అభ్యర్ధులకు బీ ఫారాలు అందజేయనున్నారు గులాబీ దళపతి. నవంబర్‌ 9న గజ్వేల్‌, కామారెడ్డిలో కేసీఆర్‌ నామినేషన్‌ వేయనున్నారు. అనంతరం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు.

తేదీ నియోజకవర్గాలు.. సభలు సమావేశాలు సమయం.

15-10-2023 అక్టోబర్‌ హుస్నాబాద్‌

16-10-2023 అక్టోబర్‌ జనగాం, భువనగిరి

17-10-2023 అక్టోబర్‌ సిరిసిల్ల, సిద్దిపేట

18-10-2023 అక్టోబర్‌ జడ్చర్ల, మేడ్చల్‌

26-10-2023 అక్టోబర్‌ అచ్చంపేట, నాగర్‌కర్నూలు, మునుగోడు

27-10-2023 అక్టోబర్‌ పాలేరు, స్టేషన్‌ ఘన్‌పూర్

29-10-2023 అక్టోబర్‌ కోదాడ, తుంగతుర్తి, ఆలేరు

30-10-2023 అక్టోబర్‌ జుక్కల్‌, బాన్సువాడ, నారాయణ్‌ఖేడ్‌

31-10-2023 అక్టోబర్‌ హుజూర్‌నగర్‌, మిర్యాలగూడ, దేవరకొండ

1-11-2023 నవంబర్‌ సత్తుపల్లి, ఇల్లెందు

2-11-2023 నవంబర్‌ నిర్మల్‌, బాల్కొండ, ధర్మపురి

3-11-2023 నవంబర్‌ భైంసా(ముధోల్‌), ఆర్మూర్‌, కోరుట్ల

4-11-2023 నవంబర్‌ కొత్తగూడెం, ఖమ్మం

5-11-2023 నవంబర్‌ గద్వాల్‌, మఖ్తల్‌, నారాయణపేట

6-11-2023 నవంబర్‌ చెన్నూరు, మంథని, పెద్దపల్లి

7-11-2023 నవంబర్‌ సిర్పూర్‌, ఆసిఫాబాద్‌, బెల్లంపల్లి

నవంబర్‌ 10 వరకు నామినేషన్ల స్వీకరణ..నవంబర్‌ 13న నామినేషన్ల పరిశీలన. నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్‌ 15 చివరి తేదీని కేంద్ర ఎన్నిక సంస్థ ప్రకటించింది. నవంబర్ 30 ను తెలంగాణ వ్యాప్తంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్‌ 3న అధికారికంగా ఎన్నికల ఫలితాలు విడుదల చేయనున్నారు తెలంగాణ