కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల (Tirumala) శ్రీ వెంకటేశ్వర స్వామి (Sri Venkateswara Swamy) వారిని అత్యంత ముఖ్యమైన ప్రదేశం.. శ్రీవారి పుష్కరిణిని టీటీడీ అధికారులు (TTD Officials) మూసివేశారు. శ్రీవారి పుష్కరిణి ఘాట్ లోని నీటిని తొలగించి.. నీటిని శుద్ధి చేసి.. పైపులైన్ల మరమ్మతులు, ఇతర పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. దీంతో నేటి నుంచి ఆగస్టు 1 నుంచి 31 వరకు పుష్కరిణి హారతి ఉండదన్నారు. కాగా స్వామి వారి పుష్కరిణిలో నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించేందుకు అత్యుత్తమ రీసైక్లింగ్ వ్యవస్థ అందుబాటులో ఉందని టీటీడీ (TTD) అధికారులు తెలిపారు. దీంతో ఈ పనులకు అటంకం కలగకుండా.. పూర్తి నెల రోజుల పాటు మూసివేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. కాగా స్వామి వారి పుష్కరిణిలో తిరిగి వినియోగించేందుకు అత్యుత్తమ రీసైక్లింగ్ వ్యవస్థ అందుబాటులో ఉంది.
తిరుమ తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. తిరుమల శ్రీవారి సేవలో తరించేందుకు భక్తులు తరలివస్తున్నారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి దాదాపు 8 గంటల సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. ఇక సోమవారం తిరుమల శ్రీవారిని 67 వేల 916 భక్తులు దర్శించుకున్నారు. 23 వేల 10 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.93 కోట్లు వచ్చినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు.