Twitter: నేటి నుంచి ట్విట్టర్ ఫ్రీ కాదు.. పోస్ట్ చేయాలంటే డాలర్ చెల్లించాలి

ట్విట్టర్ ఇది ఎక్స్ గా పేరు మార్చుకున్నపట్టి నుంచి సరికొత్త ప్రయోగాలను చేస్తోంది. గతంలో సబ్ స్క్రిప్షన్, నాన్ సబ్ స్క్రిప్షన్ అనే రెండు విధానాలను తీసుకొచ్చింది. ఇంకొన్ని రోజులకు పోస్ట్ చేయాలన్నా, చూడాలన్నా పరిమితులు విధించింది. తాజాగా డాలర్ చెల్లించాల్సిందే అంటూ సరికొత్త రూల్స్ ప్రవేశపెట్టింది.

  • Written By:
  • Publish Date - October 18, 2023 / 09:19 AM IST

ఎలాన్ మస్క్ తీసుకొచ్చిన సరికొత్త సోషల్ మీడియా యాప్ ట్విట్టర్. ఇది వచ్చిన తొలినాళ్లలోనే మంచి ఆదరణ లభించింది. సామాన్యుడి మొదలు సెలబ్రెటీల వరకూ అందరూ ఇందులో తమ అభిప్రాయాలను వెల్లడించేవారు. దీంతో తన భావాలను పంచుకునేందుకు ఒక అందమైన, అద్భుతమైన వేదిక అందుబాటులోకి వచ్చిందని ప్రతి ఒక్కరూ సంబరపడ్డారు. ఇది ఎంతో కాలం నిలువలేదు. ఈ ఆశలన్నింటినీ డేటా తరిగిపోయినట్లుగా కరిగించేశారు ఈ సంస్థ అధినేత. రోజుకు ఇన్ని పోస్టులు మాత్రమే పెట్టాలి. ఇన్నీ మాత్రమే షేర్ చేయాలి అంటూ నాన్ సబ్ స్క్రిప్షన్ యూజర్లకు కొత్త రూల్స్ తీసుకువచ్చారు. ఇదిలా సాగుతున్న క్రమంలో నేటి నుంచి మరిన్ని పరిమితులు విధించారు.

కొత్తగా జాయిన్ అయిన యూజర్లు పోస్టు, రీట్వీట్లు, రిప్లై, లైక్, బుక్ మార్క్, మెసెజ్ చేయాలంటే ఏడాదికి డాలర్ ఫీజు చెల్లించాల్సిందే అంటున్నారు. దీనిని ప్రస్తుతం న్యూజిలాండ్, ఫిలిప్పిన్స్లో ప్రయోగదశలో ఉంచారు. ఇక్కడ విజయవంతమైతే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ట్విట్టర్ యూజర్లకు వర్తింపజేస్తారు. ఎందుకు ఇలాంటి నిబంధనలను తీసుకొచ్చారో కూడా వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న ఆన్లైన్ యుగంలో సైబర్ నేరాలు అధికంగా జరుగుతున్నాయి. అందుకే స్పామ్, ఆటోమేటెడ్ బాట్ అకౌంట్లను తగ్గించాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. డాలర్ చెల్లించని వాళ్ల అకౌంట్లు ఏమౌతాయన్న సందేహం మీలో కలుగువచ్చు. ఎలాంటి ఫీజు చెల్లించకుండా ఉన్న వారికి కేవలం రీడ్ ఓన్లీ ఆప్షన్ తో ట్విట్టర్ ఖాతాలను కొనసాగించవచ్చని ప్రకటించారు.

T.V.SRIKAR