Gaddar Statue: ట్యాంక్‌బండ్‌పై గద్దరన్న విగ్రహం.. మరి చివరి కోరిక సంగతేంటి ?

గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని తెల్లాపూర్ మున్సిపాలిటీ చేసిన తీర్మానాన్ని హెచ్‌ఎండీఏ ఆమోదించింది. విగ్రహ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని కేటాయిస్తూ రేవంత్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

  • Written By:
  • Updated On - January 30, 2024 / 06:43 PM IST

Gaddar Statue: కాంగ్రెస్‌ అధికారం వచ్చిన వెంటనే హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ప్రజాకవి గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానన్న రేవంత్‌రెడ్డి.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ప్రజా యుద్ధనౌక గద్దర్ విగ్రహ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని తెల్లాపూర్ మున్సిపాలిటీ చేసిన తీర్మానాన్ని హెచ్‌ఎండీఏ ఆమోదించింది. విగ్రహ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని కేటాయిస్తూ రేవంత్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

KUMARI AUNTY: వైరల్ కుమారి అంటీపై కేసు.. అరెస్ట్‌..

గద్దర్‌ చనిపోయిన టైమ్‌లో.. రాజకీయ పార్టీలు స్పందించిన తీరు అప్పట్లో చర్చకు దారి తీశాయి. టీపీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్ రెడ్డి.. మాత్రం గద్దర్ అంతిమయాత్రలో అన్నీ తానై ముందుకు నడిపించారు. గద్దర్ మరణవార్త తెలిసిన వెంటనే ఆస్పత్రికి చేరుకున్న రేవంత్.. భౌతికకాయాన్ని ఎల్బీ స్టేడియంకు తరలించడం దగ్గర నుంచి అంతిమయాత్ర, అంత్యక్రియలు.. ఇలా అన్నింటిలో ముందుండి నిర్వహించారు. ప్రభుత్వ లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు జరిగినప్పటికీ.. అక్కడ అన్నీ చూసుకుంది మాత్రం రేవంత్ రెడ్డే. ఒక్కమాటలో చెప్పాలంటే గద్దర్‌ను కాంగ్రెస్ తన సొంతమనిషిలా చూసుకుని ఘనంగా వీడ్కోలు పలికింది. విగ్రహం ఏర్పాటుకు లైన్ క్లియర్ అయినా.. గద్దర్ చివరి కోరిక నెరవేరుతుందా అనే చర్చ జరుగుతోంది. గద్దర్ తన కొడుకు సూర్యను రాజకీయాల్లో తీసుకురావాలని ఎంతో ప్రయత్నించారు.

కుమారుడితో పాటు ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలిసి ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. కొత్త పార్టీ పెట్టాలన్న ఆలోచనను కూడా పక్కన పెట్టి.. చివరి వరకు కాంగ్రెస్‌ పార్టీతో మంచి సంబంధాలు కొనసాగించారు. అయితే కుమారుడిని రాజకీయాల్లో ఉన్నత స్థాయిలో చూడాలన్న కోరిక తీరకుండానే గద్దర్ ప్రాణాలు వదిలారు. ఆయన కోరికను నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. గద్దర్ కుటుంబానికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. కుమారుడికి బదులుగా గద్దర్ కుమార్తె వెన్నెలకు గత ఎన్నికల్లో హైదరాబాద్ కంటోన్మెంట్‌ టికెట్‌ను కాంగ్రెస్ కేటాయించింది.