Telangana Movement: అడవి తల్లి ఒడిలో సేదతీరిన తెలంగాణ బిడ్డ

1990 ప్రాంతంలో మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నక్సలైట్లపై ఉదారంగా వ్యవహరించి వారిపై నిషేధాన్ని ఎత్తివేశారు. ఈ సందర్భంగా జన నాట్య మండలి ఆధ్వర్యంలో గద్దర్ నిజాం కాలేజ్ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించారు.

  • Written By:
  • Publish Date - August 6, 2023 / 06:26 PM IST

దీనికి అశేష సంఖ్యలో 2 లక్షల మందికి పైగా ప్రజలు హాజరయ్యారు. ఇలా ప్రజా పోరాటంలో భాగమైనందుకు 1997లో ఏప్రిల్ 6న పోలీసులు ఇతనిపై జులుం ప్రదర్శించారు. ఈ సందర్భంలోనే అనేక తూటాలు అతని దేహంలో చొచ్చుకుపోయాయి. వెంటనే ఆపరేషన్ చేసి అన్ని బులెట్లను తొలగించారు. కానీ ఒక్క బులెట్ మాత్రం తొలగించలేదు. దీనిని తొలగిస్తే అతని ప్రాణానికే ముప్పు అని భావించారు వైద్యులు. నేటికీ ఆ బులెట్ అలాగే అతని శరీరంలో అలాగే ఉండిపోయింది. తనువు చాలించినా చరిత్ర గురించి నేటికీ గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇది గద్దర్ కి ఇచ్చే అరుదైన గౌరవంగా భావించవచ్చు.

ఇలాంటి సమయంలోనే గద్దర్ లో పోరాట స్పూర్తి మరింత రగిలింది. విప్లవ సాహిత్యం అతన మనసులో మెదిలింది. పాలకులు, అధికారులు చేసే దుర్మార్గాలను ప్రజలముందు ఉంచారు. అనేక విప్లవ రచయితల సంఘం ద్వారా ప్రజలను చైతన్య పరుస్తూ వచ్చారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో వెనుకబడిన వర్గాలతో పాటూ నిమ్న సామాజిక వర్గానికి చెందిన వారికి మేలు చేసేందుకు సంకల్పించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం తనవంతు కృషితోపాటూ చేయూతను అందించారు. కళాకారులను రంజింపజేసేలా రచనలు, నృత్యాలు, పాటలు పాడుతూ అందరినీ కూడబలుక్కొని పోరాటాన్ని తీవ్రరూపం దాల్చేలా చేశారు. ఈ ఉద్యమానికి మునుపు పూర్తి కమ్యూనిస్ట్ భావజాలంతో ఉన్నప్పటికీ ప్రత్యేక రాష్ట్ర సాధనలో కమ్యూనిస్ట్ పార్టీలతో విభేదించి ఉద్యమాన్ని చేశారు. ఈయన మొదటి నుంచి తెలంగాణ వాదే. దేవేంద్ర గౌడ్ తెలంగాణ పార్టీని స్థాపించినప్పుడు దానికి గద్దర్ మద్దతు పలికారు.

T.V.SRIKAR