Galla Jayadev: రాజకీయాలకు గల్లా గుడ్ బై.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టార్గెట్ చేశాయన్న ఎంపీ

2024 ఎన్నికల్లో పోటీ చేయబోవడ లేదన్నారు. ప్రభుత్వాలు తనను టార్గెట్ చేసినందువల్ల మౌనంగా ఉండలేక, వ్యాపారానికి పూర్తి సమయం కేటాయించాల్సి ఉన్నందున రాజకీయాలకు దూరమవుతున్నట్లు తెలిపారు. ఆదివారం గల్లా జయదేవ్ మీడియాతో మాట్లాడారు.

  • Written By:
  • Publish Date - January 28, 2024 / 02:47 PM IST

Galla Jayadev: తనను, తన వ్యాపారాల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టార్గెట్ చేశాయని, ఈ నేపథ్యంలో రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నానని ప్రకటించారు టీడీపీ నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్. ఆయనకు అమరరాజా సంస్థతోపాటు పలు వ్యాపారాలు కూడా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. 2024 ఎన్నికల్లో పోటీ చేయబోవడ లేదన్నారు. ప్రభుత్వాలు తనను టార్గెట్ చేసినందువల్ల మౌనంగా ఉండలేక, వ్యాపారానికి పూర్తి సమయం కేటాయించాల్సి ఉన్నందున రాజకీయాలకు దూరమవుతున్నట్లు తెలిపారు. ఆదివారం గల్లా జయదేవ్ మీడియాతో మాట్లాడారు.

BRS-KCR: బీఆర్ఎస్ తెలంగాణకే పరిమితమా..? జాతీయ రాజకీయాలకు దూరమేనా..?

“రాజకీయాల్లో ఉంటే నా పని నేను చేయలేకపోతున్నా. కేంద్ర ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం నన్ను ఇబ్బంది పెడుతోంది. అందుకే మౌనంగా ఉండలేను. రాజకీయం, వ్యాపారం రెండు చోట్ల ఉండలేని పరిస్థితి ఉంది. అందుకే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా. ఏపీలో పరిశ్రమల విస్తరణకు ఇబ్బందులు కలిగాయి. తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో నెలకొల్పాం. విదేశాల్లో పరిశ్రమలను విస్తరిస్తున్నాం. రాజకీయాల్లో నుంచి వైగొలిగే పరిస్థితి వస్తుందని అనుకోలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నన్ను టార్గెట్ చేశాయి. నేను రాజకీయంగా అన్నీ తట్టుకొని నిలబడ్డా. అవసరమైతే మళ్లీ రాజకీయాల్లోకి వస్తా. ఈ సారి పార్ట్ టైం రాజకీయ నాయకుడిగా మాత్రమే వస్తా. ప్రాంతీయ పార్టీలలో పార్టీ లైన్ ప్రకారం మాట్లాడాలి. రాష్ట్ర హక్కుల కోసం పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెట్టిన సమయంలో మాట్లాడా. దాంతో ఈడీ అధికారులు నన్ను పిలిచి బెదిరించారు.

నేను చట్ట ప్రకారమే వ్యాపారం చేస్తున్నానని చెప్పా. వ్యాపారం చేయాలంటే ప్రభుత్వ సహకారం తప్పనిసరి. 70 ప్రభుత్వ విభాగాల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ విభాగాలను ఆయుధాలుగా మార్చి మాపై ప్రయోగించారు. వీటిపై న్యాయపరంగా ముందుకు వెళ్లాం. కోర్టులో గెలుస్తామనే నమ్మకం ఉంది. పోరాటంలో గెలిచినా, యుద్ధంలో ఓడిన పరిస్థితి ఏర్పడింది” అని గల్లా జయదేవ్ పేర్కొన్నారు.