Junior Doctors strike : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జూడాల సమ్మె.. రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిన OP – OT సేవలు

తెలంగాణ జూనియర్ డాక్టర్లు (జూడా) నిరవధిక సమ్మెకు దిగారు. ఈ మేరకు జూడాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సీహెచ్ జీ సాయిశ్రీ హర్ష, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె.ఐజాక్ న్యూటన్, చైర్ పర్సన్ డాక్టర్ డి.శ్రీనాథ్ లు ఆదివారమే ఒక ప్రకటన పేర్కొన్నారు

 

 

తెలంగాణ జూనియర్ డాక్టర్లు (జూడా) నిరవధిక సమ్మెకు దిగారు. ఈ మేరకు జూడాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సీహెచ్ జీ సాయిశ్రీ హర్ష, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె.ఐజాక్ న్యూటన్, చైర్ పర్సన్ డాక్టర్ డి.శ్రీనాథ్ లు ఆదివారమే ఒక ప్రకటన పేర్కొన్నారు. గత నాలుగు రోజులుగా వారు నిరసనలు చేస్తున్నారు. ఆసుపత్రుల్లో మౌలిక వసతులు లేవని, NMC గైడ్ లైన్స్ ప్రకారం హాస్టల్ వసతి సరిగ్గా లేదని.. ప్రభుత్వం నుంచి వచ్చే నెలనెలా ఉపకార వేతనం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని జూనియర్ డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు పని ప్రదేశాల్లో భద్రత పెంచాలని.. ఉస్మానియా కొత్త భవనం నిర్మాణం చేయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.

దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఎమర్జెన్సీ మినహా ఓపీ, సర్జరీలు, వార్డ్ సేవలను నిలిపివేస్తున్నట్లు జూడా అసోసియేషన్ తెలిపింది. గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి ప్రతినెలా స్టైఫండ్ చెల్లింపు, సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్లకు రూ.1.25 లక్షల గౌరవ వేతనం వంటి డిమాండ్లను పరిష్కరించాలని, లేకపోతే సమ్మెను ఉద్ధృతం చేస్తామని ప్రకటించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో OP సేవలు, తాత్కాలిక OT సేవలను బహిష్కరించి జూనియర్ డాక్టర్లు సమ్మెలో పాల్గొన్నారు.