Kalki: కల్కీకి.. గణపతి షాక్.. 

కల్కీ మూవీ 2898 ఏడీ అంటే మరో ఎనిమిది వందల ఏళ్ల తర్వాత ప్రపంచం ఎంత గోరంగా ఉంటుంది. న్యూ క్లియర్ వార్ తర్వాత భూమి నీరు, తిండీ లేకజనం సమస్యలు ఎలా ఉంటాయి.. అలాంటి పరిస్థితిలో జనాన్ని కాపాడటానికి సూపర్ హీరో గా కల్కీ వచ్చి ఏం చేస్తాడు.

  • Written By:
  • Publish Date - September 30, 2023 / 06:00 PM IST

కల్కీ మూవీ 2898 ఏడీ అంటే మరో ఎనిమిది వందల ఏళ్ల తర్వాత ప్రపంచం ఎంత గోరంగా ఉంటుంది. న్యూ క్లియర్ వార్ తర్వాత భూమి నీరు, తిండీ లేకజనం సమస్యలు ఎలా ఉంటాయి.. అలాంటి పరిస్థితిలో జనాన్ని కాపాడటానికి సూపర్ హీరో గా కల్కీ వచ్చి ఏం చేస్తాడు.

ఇలాంటి కథాంశంతో కల్కీ రాబోతోంది. ఈ సైంటిఫిక్ ఫిక్షన్ గ్లింప్స్ మొన్నీమధ్యే వచ్చి వండర్ చేసింది. అంతవరకు ఓకే కాని ఈ మూవీ మే9 న రాబోతోందన్నారు. ఈలోపే సినిమా కథ, సీన్లు, మొత్తం సీక్రెట్లు లీకయ్యే ఉందంటున్నారు. చిన్న ఇమేజ్ లీకైతేనే లీగల్ యాక్షన్ తీసుకున్న కల్కీ సినిమా టీంకి హిందీ మూవీ గణపత్ టెన్షన్ పెట్టిస్తోంది. ఎందుకంటే గణ్ పత్ టీజర్ చూస్తే ఇది మరో కల్కీనా అనేలా ఉందనే ఫిలీంగే కలుగుతోంది. అంటే రెండూ ఒకే కథలనిపించకపోయినా, అదేదో కూడబలుక్కున్నట్టుట ఒకేలా రెండు టీజర్లున్నాయనే కామెంటే పేలుతోంది.

టైగర్ ష్రాఫ్, క్రుతి సనన్ కాంబినేషన్ లో తెరకెక్కిన గణపత్ మూవీలో టైగర్ ష్రాఫ్ లార్డ్ గణేష్ కి మానవ అవతారం అనిపించేలా టీజర్ వచ్చింది. ఇక ఇది 2070 అంటే మరో యాభైఏళ్ల తర్వాత ప్రపంచం ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నంగా కనిపిస్తోంది. అలానే ఇందులో కూడా కల్కీ ప్రోమోలో ఉన్నట్టే, నీటి సమస్యతో సతమతమయ్యే జనం.. అలానే కల్కీలో హీరో దేవుని అవతారమేమో అనిపించే సూపర్ హీరో, ఇక్కడ గణపత్ లో టైగర్ ష్రాఫ్ వేసిన పాత్ర అలాంటిదే.. టీజర్లు చూస్తే ఇలాంటి అభిప్రాయమే వినిపడుతోంది.

కథ సేమో కాదో కాని, రెండు మూవీల టీజర్లు దగ్గర దగ్గరగా ఉండటం, అలానే గణపత్ మూవీ ముందు దసరాకు రాబోతోంది కాబట్టి, ఆతర్వాత 7 నెల్లకు వచ్చే కల్కీ మీద ఎగ్జైట్ మెంట్ తగ్గొచ్చనే అంటున్నారు. ఏదేమైనా కల్కీ రేంజ్ క్వాలిటీ గణ పత్ మూవీ టీం ఇవ్వొచ్చు ఇవ్వకపోవచ్చు. కాని ఒకే బ్యాక్ డ్రాప్ తో వస్తే మాత్రం కథ తెలుసుకుని థియేటర్స్ లోకి వెళ్లిన ఆడియన్స్ లా అవుతుంది జనం పరిస్థితి అంటున్నారు