GANGSTER MARRIAGE: హరియానాకు చెందిన గ్యాంగ్ స్టర్ సందీప్ అలియాస్ కాలా జతేథీ.. రాజస్థాన్ కు చెందిన లేడీ డాన్ అనురాధ చౌదరి పెళ్ళి జరగబోతోంది. ఈనెల 12న ఢిల్లీలోని ద్వారకా సెక్టార్3 లో ఓ హాల్లో మ్యారేజ్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పెళ్ళికి 250 మందికి పైగా పోలీసులు హాజరవుతున్నారు. వీళ్ళు వచ్చేది గెస్టులుగా కాదు. ఎలాంటి ఆటంకం లేకుండా పెళ్ళి జరిపించడానికి. బందోబస్తు కోసం ఆటోమేటెడ్ హైటెక్ వెపన్స్‌తో పోలీసులు రెడీ అయ్యారు. ఇందులో ఢిల్లీ పోలీసులతో పాటు.. స్పెషల్ సెల్, క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, హర్యానాకు చెందిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ సిబ్బంది కూడా పాల్గొంటున్నారు.
Oscar 2024: చివరి నిమిషంలో.. ఇండియన్ డాక్యుమెంటరీకి దక్కని ఆస్కార్
గ్యాంగ్‌స్టర్స్ సందీప్, అనురాధ మీద బోల్డన్ని కేసులు ఉన్నాయి. ఈ ఇద్దరూ నాలుగేళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. అనురాధ బెయిల్ పై బయటే ఉన్నా.. పెళ్ళికొడుకు సందీప్ ఇంకా తీహార్ జైల్లో ఉన్నాడు. వీళ్ళ పెళ్ళికి కోర్టు అనుమతి ఇచ్చింది. సందీప్ మరో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కి అత్యంత సన్నిహితుడు. ఇతనిపై అప్పట్లో 7 లక్షల రూపాయల పోలీస్ రివార్డు కూడా ఉంది. 2017లో పోలీస్ ఎన్ కౌంటర్ లో చనిపోయిన గ్యాంగ్ స్టర్ ఆనంద్ పాల్ సింగ్ దగ్గర పనిచేసింది అనురాధ ప్రేమికులు ఇద్దరిపైనా దోపిడీలు, హత్యలు, అటెంప్ట్ టు మర్డర్ కేసులు ఉన్నాయి. సందీప్‌పై కిడ్నాప్, మనీ లాండరింగ్, బెదిరింపుల కేసులు ఉన్నాయి. 2020లో ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా గ్యాంగ్ స్టర్స్ సందీప్, అనురాధ మధ్య పరిచయం ఏర్పడింది. ఇద్దరూ చేసేది ఒకే ప్రొఫెషన్ కావడం.. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ తో ప్రేమలో పడ్డారు. పోలీసుల నుంచి తప్పించుకుంటూ ఎన్నో రాష్ట్రాలు ప్రేమయాత్ర చేశారు. 2021లో ఈ ఇద్దరు గ్యాంగ్ స్టర్స్ పోలీసులకు పట్టుబడ్డారు. అనురాధ బెయిల్ పై బయటకు వచ్చింది. తర్వాత ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. పోలీసులు ఒప్పుకోకపోవడంతో.. కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చింది అనురాధ.
పెళ్ళి కారణంగా సందీప్‌కి కోర్టు పెరోల్ మంజూరు చేసింది. 12వ తేదీ నాడు 6 గంటల పాటు తిహార్ జైలు నుంచి బయటకు వెళ్ళడానికి అనుమతి ఇచ్చింది. ఉదయం పదింటి నుంచి సాయంత్రం నాలుగు గంటల దాకా సందీప్‌కి పెరోల్ శాంక్షన్ అయింది. దాంతో గ్యాంగ్‌స్టర్స్ పెళ్ళి కోసం 51 వేల రూపాయలతో ఓ మ్యారేజ్ హాల్ బుక్ చేశాడు వాళ్ళ లాయర్. తన పెళ్ళికి వచ్చే 150 మంది గెస్ట్ లిస్ట్ ను సందీప్ ఢిల్లీ పోలీసులకు అందించాడు. పెళ్ళిలో వండి వడ్డించే వెయిటర్స్ అందరికీ పోలీసులు ముందుగానే ఐడెంటీ కార్డులు జారీ చేశారు. అనురాధ తరపున ఆమె చెల్లి, సోదరుడు మాత్రమే పెళ్ళికి వస్తున్నారు. ఇద్దరు గ్యాంగ్‌స్టర్స్ పెళ్ళి చేసుకోవడం ఏమో గానీ.. నాలుగు రాష్ట్రాల పోలీసులకు తిప్పలు వచ్చాయి. వీళ్ళ పెళ్ళికి పెద్ద ఎత్తున గ్యాంగ్‌స్టర్స్ వస్తారని భావిస్తున్నారు. సందీప్, అనురాధకి ప్రత్యర్థులు చాలామంది ఉన్నారు.
అందుకే పెద్ద ఎత్తున గొడవలు జరిగే అవకాశముందని ఢిల్లీ, హరియానా, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు అలెర్ట్ అయ్యారు. చెక్ పోస్టులు పెట్టి తనిఖీలు చేస్తున్నారు. ఎవరి దగ్గరా ఆయుధాలు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. ఢిల్లీలోని ద్వారక ఏరియాలో పెళ్ళి జరిగే హాల్ దగ్గర ప్రత్యేక స్క్వాడ్స్ మోహరించాయి. గ్యాంగ్ స్టర్స్ సందీప్, అనురాధ క్షేమంగా పెళ్ళి చేసుకొని వెళ్ళే దాకా భద్రత కల్పించడం పోలీసులకు పెద్ద సవాల్ గా మారింది.