Gangula Kamalkars : గంగుల ప్రచార వాహనం పై చెప్పుతో దాడి..

కరీంనగర్లో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రచార రథంపై చెప్పుతో దాడి చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో భాగంగా గంగుల కమలాకర్ కు చెందిన ఎల్ఈడి బండి కరీంనగర్లోని గోపాల్పూర్ లో తిరుగుతోంది. ఈ ఎన్నికల ప్రచార వాహనాన్ని చూసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు జగదీశ్వరా చారి కోపంతో ఆ వాహనాన్ని చెప్పుతో కొట్టాడు.

తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సారి ఎన్నికల్లో చాలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో ప్రత్యర్ధులు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు , ఆరోపణలు చేసుకునేవారు.. ఇప్పుడు అలా లేదు పార్టీ కార్యకర్తలే నేరుగా ఎమ్మెల్యే అభ్యర్థుల పై దాడులకు దిగబడుతున్నారు. నిన్న బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై దాడి ఘటన మరువకముందే కరీంనగర్ లో మరో బీఆర్ఎస్ మంత్రిపై దాడి జరిగింది.

కరీంనగర్లో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రచార రథంపై చెప్పుతో దాడి చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో భాగంగా గంగుల కమలాకర్ కు చెందిన ఎల్ఈడి బండి కరీంనగర్లోని గోపాల్పూర్ లో తిరుగుతోంది. ఈ ఎన్నికల ప్రచార వాహనాన్ని చూసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు జగదీశ్వరా చారి కోపంతో ఆ వాహనాన్ని చెప్పుతో కొట్టాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో పోలీసులు అతడి మీద కేసు నమోదు చేశారు.

సోమవారం బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాకలో కత్తితో దాడి జరిగిన విషయం తెలిసిందే. హత్యాయత్నానికి పాల్పడిన నిందితులు, రాజకీయ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నాయి. రాయపోల్, దుబ్బాక, తోగుట, దౌల్తాబాద్, మిరుదొడ్డి, చేగుంట, నార్సింగి, అక్బర్పేట- భూంపల్లి మండలాల్లో బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. దుబ్బాక నియోజకవర్గంలో బంద్ లో భాగంగా మండల కేంద్రాలు, నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మంగళవారం ఉదయం 11 గంటల నుంచి నల్లజెండాలతో నిరసన కార్యక్రమాలు చేపట్టారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. ఈ మేరకు దుబ్బాకలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి.

SURESH