GANJA IN HYDERABAD: గంజాయి చాక్లెట్లు తింటున్న స్కూల్ పిల్లలు.. బెంబేలెత్తిపోతున్న పేరెంట్స్‌..

గంజాయి స్మగ్లర్స్‌ స్కూల్ పిల్లల్ని టార్గెట్‌ చేశారు. గంజాయికి బానిసలైన పిల్లలు.. ఇంట్లో గొడవ చేసి మరీ డబ్బులు తెచ్చుకుని చాక్లెట్లు కొనుక్కుని తినేవాళ్లు. కానీ వాళ్ల ప్రవర్తనలో వచ్చిన మార్పు.. ఈ మొత్తం దందాను బయటపెట్టింది.

  • Written By:
  • Publish Date - January 10, 2024 / 06:08 PM IST

GANJA IN HYDERABAD: హైదరాబాద్‌ను మరోసారి గంజాయి షేక్‌ చేసింది. ఈ సారి గంజాయి తీసుకుంది సెలబ్రెటీలో.. కాలేజీ స్టూడెంట్సో కాదు. స్కూల్‌ పిల్లలు. ఔను.. గంజాయి స్మగ్లర్స్‌ స్కూల్ పిల్లల్ని టార్గెట్‌ చేశారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు గవర్నమెంట్‌ స్కూల్‌ దగ్గర ఓ పాన్‌షాప్‌ ఉంటుంది. అక్కడ దొరికే చాక్లెట్లంటే స్కూల్‌ పిల్లలకు ఎంతో ఇష్టం. ఎగబడి మరీ ఆ షాప్‌లో చాక్లెట్లు కొంటుంటారు. స్కూల్‌ ఎగ్గొట్టడానికి రెడీ అవుతారు కానీ.. ఆ షాప్‌లో చాక్లెట్లు కొనడం, తినడం మాత్రం మిస్‌ అవ్వరు. అక్కడి చాక్లెట్లు తిన్న తరువాత పిల్లల బిహేవియర్‌లో మార్పు వస్తుంది.

Nara Chandrababu Naidu: చంద్రబాబుకు భారీ ఉపశమనం.. మూడు కేసుల్లో ముందస్తు బెయిల్..

మత్తులో ఊగిపోతుంటారు. స్కూల్‌లో నానా అల్లరి చేస్తారు. ఇదే విషయాన్ని చాలాసార్లు గమనించిన స్కూల్‌ టీచర్లు.. రీసెంట్‌గా పోలీసులకు ఇన్ఫర్మేషన్‌ ఇచ్చారు. వెంటనే ఆ షాప్‌మీద రైడ్‌ చేసిన పోలీసులకు కళ్లు చెదిరే నిజాలు తెలిశాయి. ఆ షాపువాడు అమ్ముతున్నది నార్మల్‌ చాక్లెట్లు కాదు. గంజాయి కలిపిన చాక్లెట్లు. అవును.. అడ్డదారిలో డబ్బు సంపాదించేందుకు చిన్న పిల్లలకు గంజాయి అలవాటు చేశారు ఈ నీచులు. గంజాయిని లిక్విడ్‌గా మార్చి.. ఆ లిక్విడ్‌తో చాక్లెట్లు తయారు చేశారు. ఆ చాక్లెట్లను పిల్లలకు అలవాటు చేసేందుకు మొదట్లో వాటిని పిల్లలకు ఫ్రీగా ఇచ్చారు. చాక్లెట్లు తినగానే మత్తుగా ఉండటంతో పిల్లలు కూడా ఇష్టంగా రోజూ చాక్లెట్లు తినేవాళ్లు. వాళ్లంతా చాక్లెట్లకు బాగా అలవాటుపడ్డ తరువాత ఒక్కో చాక్లెట్‌ 20 రూపాయలకు అమ్మడం మొదలుపెట్టారు. అప్పటికే ఆ గంజాయికి బానిసలైన పిల్లలు.. ఇంట్లో గొడవ చేసి మరీ డబ్బులు తెచ్చుకుని చాక్లెట్లు కొనుక్కుని తినేవాళ్లు. కానీ వాళ్ల ప్రవర్తనలో వచ్చిన మార్పు.. ఈ మొత్తం దందాను బయటపెట్టింది. అయితే నిందితులు కేవలం ఈ షాప్‌లోనే చాక్లెట్లు అమ్మారా.. లేక ఇంకా వేరే షాపులకు కూడా ఈ చాక్లెట్లు సరఫరా చేశారా అనే విషయంలో విచారణ చేస్తున్నారు పోలీసులు. గతంలో టాలీవుడ్‌ను షేక్‌ చేసిన డ్రగ్స్‌ కేసు కూడా ఇలానే బయటపడింది.

బెంగళూరులో కాలేజీ స్టూడెంట్స్‌కు డ్రగ్స్‌ అలవాటు చేసిన విక్రయిస్తున్న కెవిన్‌ అనే ఓ డ్రగ్స్‌ పెడ్లర్‌ను అరెస్ట్‌ చేశారు పోలీసులు. అరెస్ట్‌ ఐనప్పుడు కెవిన్‌ మాత్రమే నిందితుడు. కానీ కెవిన్‌ అరెస్ట్‌తో డ్రగ్స్‌ రాకెట్‌ మొత్తం బయటికి వచ్చింది. ఆఖరికి టాలీవుడ్‌ సెలబ్రెటీస్‌ను కూడా విచారణకు రప్పించింది. హైదరాబాద్‌, బెంగళూరు కేంద్రాలుగా డ్రగ్స్‌ దందాకు తెరలేపాడు కెవిన్‌. విదేశాల నుంచి డ్రగ్స్‌ తెప్పించి.. హైదరాబాద్‌లో, బెంగళూరులో అమ్మేవాడు. కొందరిని డ్రగ్స్‌కు బానిసలుగా చేసి.. వాళ్లను కొరియర్లుగా కూడా వాడుకున్నాడు. అప్పట్లో టాలీవుడ్‌ను షేక్‌ చేసిన డ్రగ్స్‌ కేసు కెవిన్‌తో మొదలయ్యిందే. ఇప్పుడు కూడా అలాగే పిల్లలను టార్గెట్‌ చేసి గంజాయి దందాకు తెరలేపారు నిందితులు. ఈ దందాలో ఇంకా ఎంత మంది ఇన్వాల్వ్‌ అయ్యి ఉన్నారు అనే విషయంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ కేసు ఎంతదూరం వెళ్తుందో చూడాలి మరి.