Ganta Narahari: పొత్తులో భాగంగా తిరుపతి అసెంబ్లీ నుంచి జనసేన అభ్యర్థి బరిలో దిగడం దాదాపు కన్ఫార్మ్ అయింది. పవన్ ఇక్కడి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగినా.. భీమవరం నుంచే బరిలో దిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయ్. దీంతో తిరుపతి నుంచి జనసేన తరఫున ఎవరు బరిలో దిగబోతున్నారన్న సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడినట్లు కనిపిస్తోంది. తిరుపతి అనేది మెగా కుటుంబానికి సెంటిమెంట్ స్థానం.
RAM CHARAN: క్లీంకారా కనిపించిందోచ్.. వైరల్ అవుతున్న ఫొటోలు..
అలాంటి అసెంబ్లీలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలిచి.. అధికార పార్టీ భారీ షాక్ ఇవ్వాలని.. పవన్ కల్యాణ్ ఫిక్స్ అయ్యారు. వైసీపీ అభ్యర్థిని దీటుగా ఎదుర్కొనేందుకు తగిన వనరులున్న అభ్యర్థిని ఎంపిక చేయాలని డిసైడ్ అయ్యారు. దివంగత డీకే ఆదికేశవులు బంధువు, అంగ బలం, ఆర్థిక బలం పుష్కలంగా ఉన్న గంటా నరహరికి.. టికెట్ ఇవ్వాలని పవన్ దాదాపు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. టీడీపీలో కీలక యువనేతగా ఉన్న నరహరి.. పవన్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. సామాజిక సేవా కార్యక్రమాలతో తిరుపతి జనాలకు చేరువయిన నరహరి.. జనాల మనసు గెలుచుకున్నారు. దీనికితోడు ఆయన భారీ ఫాలోయింగ్ ఉండడం, ఆర్థికంగానూ స్ట్రాంగ్ కావడంతో.. నరహరిని తిరుపతి బరిలో నిలపాలని పవన్ కల్యాణ్ ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. ఇక అటు సామాజికవర్గాలవారీగా చూసుకున్నా.. నరహరి ఎంపిక మరింత బలంగా మారే అవకాశం ఉందని.. సేనాని అంచనా వేస్తున్నారు.
నరహరి బలిజ సామాజికవర్గానికి చెందిన నేత. తిరుపతితో దాదాపు 50వేలకు పైగా బలిజ ఓటర్లు ఉన్నారు. నరహరిని బరిలో నిలపడం ద్వారా.. ఆ వర్గాన్ని ఈజీగా ఆకర్షించొచ్చదన్నది పవన్ వ్యూహం. నిజానికి రాజంపేట ఎంపీ అభ్యర్థిగా నరహరి పేరు ప్రకటించారు చంద్రబాబు. ఐతే మారిన రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని.. జనసేనలో చేరిన నరహరి.. తిరుపతి బరిలో నిలిచేందుకు రెడీ అవుతున్నారు. భూమన కుటుంబానికి సవాల్ విసిరేందుకు సిద్ధం అయ్యారు.