Gautam Gambhir : రాజకీయాలకు గౌతమ్ గంభీర్ గుడ్ బై.. IPL కోసమేనా..?

బీజేపీ (BJP) ఎంపీ (MP), భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ రాజకీయాలకు గుడ్ బై చేప్పబోతున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు స్వయంగా తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసి.. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) ను ట్యాగ్ చేశారు.

బీజేపీ (BJP) ఎంపీ (MP), భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ రాజకీయాలకు గుడ్ బై చేప్పబోతున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు స్వయంగా తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసి.. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) ను ట్యాగ్ చేశారు. గౌతమ్ గంభీర్. ఇన్ని రోజులు ప్రజా సేవలో ఉన్న.. ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చిన ప్రధాని మోడీకి.. అమిత్ షాకు కృతజ్ఞతలు అని ట్వీటర్ వేదికగా గంభీర్ రాసుకోచ్చారు. కాగా గంభీర్ ప్రస్తుతం బీజేపీ నుంచి తూర్పు ఢిల్లీ పార్లమెంట్ ఎంపీగా కొనసాగుతున్నారు. 2019 ఎన్నికల్లో ఆయన ఈస్ట్‌ ఢిల్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు.

తనకు ఎంతో ఇష్టమైన క్రికెట్‌ కోసం తాను రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నట్లు క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌(Gautam Gambhir) తన ఎక్స్‌ ఖాతాలో ట్వీట్‌ చేశారు. రాబోయే ఐపీఎల్ మ్యాచ్ దృష్టిలో పెట్టుకొని నేను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ ట్వీట్‌ ప్రస్తుతం నెట్‌లో వైరల్‌గా మారింది. క్రికెట్‌ రంగంతో పాటు రాజకీయ వర్గాల్లోనూ ప్రస్తుతం ఇది చర్చినీయాంశంగా మారింది.

 

మరో వైపు ఈ ఎన్నికల్లో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న తూర్పు ఢిల్లీ టికెట్ గంభీర్ కు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధం లేకపోవడం వల్ల గంభీర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిన్నాయి.