Geethanjali Malli Vachindi Review: ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ రివ్యూ.. భయపెట్టలేదు కానీ నవ్వించింది..!

అంజలి ఎప్పటిలాగే తన నటనతో ఆకట్టుకుంది. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో మెప్పించింది. శ్రీనివాస్‌ రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్‌ ల త్రయం మరోసారి తమ కామెడీ టైమింగ్ తో నవ్వించారు. హీరో కావాలని కలలు కనే అయాన్ పాత్రలో నటించిన సత్య.. ఈ సినిమాకి నిజంగానే హీరో అని చెప్పవచ్చు.

  • Written By:
  • Publish Date - April 11, 2024 / 02:19 PM IST

Geethanjali Malli Vachindi Review: ప్రస్తుతం టాలీవుడ్ లో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. అంజలి ప్రధాన పాత్ర పోషించిన హారర్ కామెడీ చిత్రం ‘గీతాంజలి’ . 2014 లో విడుదలై మంచి విజయం సాధించిన ఈ మూవీకి దాదాపు పదేళ్లకు సీక్వెల్ గా వచ్చింది’. గీతాంజలి మళ్ళీ వచ్చింది’ అంటూ థియేటర్లలో అడుగుపెట్టింది. మరి ఈ సినిమా ఎలా ఉంది.. ‘గీతాంజలి’ మాదిరిగానే మెప్పించేలా ఉందా అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథ విషయానికి వస్తే..
‘గీతాంజలి’ తర్వాత వరుస పరాజయాలు ఎదురుకావడంతో సినిమా అవకాశాలు లేక కష్టాలు అనుభవిస్తుంటాడు దర్శకుడు శ్రీను. రచయితలు ఆత్రేయ, ఆరుద్రతో కలిసి చిన్న పెంట్ హౌస్‌లో రెంట్‌కి ఉంటాడు. ఆర్ధిక సమస్యల నుంచి బయటపడటం కోసం స్నేహితుడు అయాన్‌కి హీరోని చేస్తామని మాయమాటలు చెప్పి, డబ్బులు గుంజుతూ కాలం వెళ్లదీస్తూ ఉంటారు. ఒకానొక సమయంలో సినిమా రంగం వదిలేసి వెళ్లిపోదామనుకున్న సమయంలో.. బిజినెస్ మ్యాన్ విష్ణు పిలిచి మరీ సినిమా ఛాన్స్ ఇస్తాడు. అంతేకాదు, తనే ఒక హారర్ కథ రాసి ఇవ్వడమే కాకుండా.. హీరోయిన్‌గా అంజలిని తీసుకోవాలని, షూటింగ్ సంగీత్ మహల్ లోనే చేయాలని షరతులు పెడతాడు. అసలు విష్ణు ఎవరు అతని గతమేంటి శ్రీను, అంజలి వాళ్ళకి పిలిచి మరీ సినిమా అవకాశం ఎందుకు ఇచ్చాడు. సంగీత్ మహల్‌లోనే షూటింగ్ చేయమని షరతు పెట్టడానికి కారణమేంటి? ఆ మహల్ లో ఏముంది? తన చెల్లి అంజలి కోసం గీతాంజలి మళ్ళీ ఎందుకు వచ్చింది..? అనేవి సినిమా చూసి తెలుసుకోవాలి.

Allu Arjun: అన్నీ గాలి వార్తలే.. అల్లు అర్జున్‌ను పక్కన పెట్టిన అట్లీ
పెర్పామెన్స్ విషయానికి వస్తే..
అంజలి ఎప్పటిలాగే తన నటనతో ఆకట్టుకుంది. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో మెప్పించింది. శ్రీనివాస్‌ రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్‌ ల త్రయం మరోసారి తమ కామెడీ టైమింగ్ తో నవ్వించారు. హీరో కావాలని కలలు కనే అయాన్ పాత్రలో నటించిన సత్య.. ఈ సినిమాకి నిజంగానే హీరో అని చెప్పవచ్చు. అంతలా తన కామెడీతో సినిమాని నిలబెట్టాడు. ఇక కిల్లర్ నాని అనే కెమెరామ్యాన్ పాత్రలో సునీల్ కూడా గట్టిగానే నవ్వులు పంచాడు. అలీ కూడా తన మార్క్ కామెడీతో బాగానే నవ్వించాడు. ఇక శాస్త్రి అనే పాత్రలో రవి శంకర్ సర్ ప్రైజ్ చేశాడు. రాహుల్ మాధవ్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
టెక్నికల్ టీం..
కోన వెంకట్ రాసిన కథలో కొత్తదనం లేనప్పటికీ, ‘గీతాంజలి’ కథతో ముడిపెడుతూ సీక్వెల్ కథ రాసుకున్న తీరు మెప్పించింది. దర్శకుడిగా శివ తుర్లపాటి పనితనం బాగానే ఉంది. కామెడీ సన్నివేశాలను చిత్రీకరించిన తీరు ఆకట్టుకుంది. ప్రవీణ్ లక్కరాజు స్వరపరిచిన పాటలు తేలిపోయాయి. నేపథ్య సంగీతం బాగానే ఉంది. ఛోటా కె. ప్రసాద్ కెమెరా పనితనం బాగుంది.

Kalki 2898 AD: ఏదో ఒకటి ‌ ఇవ్వండి సామీ.. కల్కి’ మేకర్స్‌పై ఫ్యాన్స్‌ ఫైర్‌
నటీనటుల పనితీరు
అంజలి ఎప్పటిలాగే తన నటనతో ఆకట్టుకుంది. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో మెప్పించింది. శ్రీనివాస్‌ రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్‌ ల త్రయం మరోసారి తమ కామెడీ టైమింగ్ తో నవ్వించారు. హీరో కావాలని కలలు కనే అయాన్ పాత్రలో నటించిన సత్య.. ఈ సినిమాకి నిజంగానే హీరో అని చెప్పవచ్చు. అంతలా తన కామెడీతో సినిమాని నిలబెట్టాడు. ఇక కిల్లర్ నాని అనే కెమెరామ్యాన్ పాత్రలో సునీల్ కూడా గట్టిగానే నవ్వులు పంచాడు. అలీ కూడా తన మార్క్ కామెడీతో బాగానే నవ్వించాడు. ఇక శాస్త్రి అనే పాత్రలో రవి శంకర్ సర్ ప్రైజ్ చేశాడు. రాహుల్ మాధవ్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
ఫైనల్‌గా..
ఇది పేరుకి హారర్ కామెడీ సినిమా అయినప్పటికీ.. భయపెట్టే సన్నివేశాలు పెద్దగా లేవు గానీ, నవ్వించే సన్నివేశాలు మాత్రం బోలెడున్నాయి. కాసేపు హాయిగా నవ్వుకోవడం కోసం ఈ సినిమా హ్యాపీగా చూసేయొచ్చు.