Geethanjali: తొలి అరెస్ట్‌.. గీతాంజలి కేసులో బోండా ఉమా అనుచరుడి అరెస్ట్‌..

ట్విట్టర్ వేదికగా వైసీపీని టార్గెట్ చేస్తూ.. ఘాటైన పోస్టులు పెట్టే రాంబాబు.. గీతాంజలి విషయంలో పెట్టిన దారుణమైన పోస్ట్ పెట్టాడు. అమ్మ ఒడి ఇచ్చిందే నాలుగుసార్లు అయితే.. ఐదుసార్లు ఎలా తీసుకున్నావ్ అంటూ బూతు పదాలు వాడుతూ.. గీతాంజలి గురించి పోస్ట్ చేశాడు రాంబాబు.

  • Written By:
  • Updated On - March 14, 2024 / 07:55 PM IST

Geethanjali: గీతాంజలి ఆత్మహత్య కేసులో తొలి అరెస్ట్ జరిగింది. పసుమర్తి రాంబాబు అనే వ్యక్తిని.. తెనాలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గీతాంజలిపై సోషల్ మీడియాలో అతను అనుచిత పోస్టింగ్‌లు పెట్టినట్లు తేలింది. టీడీపీ నేత బోండా ఉమాకు రాంబాబా అనుచరుడు అని తెలుస్తోంది. బోండా ఉమాతో రాంబాబు కలసి ఉన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. ఈ కేసును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీంతో త్వరలో మరిన్ని అరెస్ట్‌లు ఖాయంగా కనిపిస్తున్నాయ్.

BJP Add Campaign: యాడ్స్ కోసం బీజేపీ రూ.30 కోట్లు ఖర్చు ! రూపాయి ఖర్చుపెట్టని బీఆర్ఎస్, కాంగ్రెస్ !

ట్విట్టర్ వేదికగా వైసీపీని టార్గెట్ చేస్తూ.. ఘాటైన పోస్టులు పెట్టే రాంబాబు.. గీతాంజలి విషయంలో పెట్టిన దారుణమైన పోస్ట్ పెట్టాడు. అమ్మ ఒడి ఇచ్చిందే నాలుగుసార్లు అయితే.. ఐదుసార్లు ఎలా తీసుకున్నావ్ అంటూ బూతు పదాలు వాడుతూ.. గీతాంజలి గురించి పోస్ట్ చేశాడు రాంబాబు. ఇక ఈ కేసులో దుర్గారావు అనే మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జగన్ పాలనలో తనకు మంచి జరిగిందంటూ ఇంటి పట్టా అందుకున్న ఆనందంలో గీతాంజలి ఓ ప్రైవేట్‌ ఇంటర్వ్యూలో భావోద్వేగానికి లోనైంది. అయితే ఈ వీడియోను టీడీపీ, జనసేన శ్రేణులు భారీగా ట్రోల్ చేశాయ్‌. ఐతే ఆ తర్వాత గీతాంజలి రైలు కింద పడి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఐతే దీనిపై టీడీపీ రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తుంటే.. విపక్షాలు నీచ రాజకీయాలు చేశాయని.. ఓ అమాయకురాలిని బలి తీసుకున్నాయని వైసీపీ కౌంటర్ ఇచ్చింది.

గీతాంజలి చుట్టూ ఏపీ రాజకీయం తిరుగుతుండడంతో.. కేసుకు ప్రాధాన్యత కనిపిస్తోంది. దీంతో ఈ కేసును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. గీతాంజలిపై అనుచిత పోస్టులు పెట్టిన టీడీపీ, జనసేన నేతల అకౌంట్ల పరిశీలన జరుగుతోందని పోలీసులు చెప్తున్నారు. చాలామంది పోస్టులు డిలీట్‌ చేసినప్పటికీ.. స్క్రీన్‌ షాట్లను పరిశీలించాక వాళ్లపై చర్యలు ఉంటాయని.. పరారీలో ఉన్న మరికొందరిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని అంటున్నారు.