General elections : ఫిబ్రవరిలోనే సార్వత్రిక ఎన్నికలు..? ముందస్తుపై బీజేపీ మొగ్గు..!

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో గెలిచింది. కాంగ్రెస్ కి తెలంగాణ ఒక్కటే దక్కింది. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. రాబోయే జనరల్ ఎలక్షన్స్ కి సెమీ ఫైనల్ గా భావించారు. ఈ సెమీ ఫైనల్స్ లో బీజేపీ దూకుడు ప్రదర్శించడంతో.. అదే స్పీడ్ లో లోక్ సభ ఎన్నికలకు కూడా వెళితే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తోంది. ఒక నెల ముందే ఎన్నికలు పెట్టడానికి కేంద్ర ఎన్నికల సంఘం కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఉత్తరాదిన మూడు రాష్ట్రాల్లో బీజేపీ అధికారం చేపట్టింది. పైగా మధ్యప్రదేశ్, రాజస్తాన్ లో గెలవడంతో ఆ పార్టీలో జోష్ కనిపిస్తోంది. బీజేపీ అనుకుంటే.. ఫిబ్రవరిలోనే ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో గెలిచింది. కాంగ్రెస్ కి తెలంగాణ ఒక్కటే దక్కింది. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. రాబోయే జనరల్ ఎలక్షన్స్ కి సెమీ ఫైనల్ గా భావించారు. ఈ సెమీ ఫైనల్స్ లో బీజేపీ దూకుడు ప్రదర్శించడంతో.. అదే స్పీడ్ లో లోక్ సభ ఎన్నికలకు కూడా వెళితే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తోంది. ఒక నెల ముందే ఎన్నికలు పెట్టడానికి కేంద్ర ఎన్నికల సంఘం కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
ఉత్తరాదిన మూడు రాష్ట్రాల్లో బీజేపీ అధికారం చేపట్టింది. పైగా మధ్యప్రదేశ్, రాజస్తాన్ లో గెలవడంతో ఆ పార్టీలో జోష్ కనిపిస్తోంది. బీజేపీ అనుకుంటే.. ఫిబ్రవరిలోనే ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి.

CM Revanth Reddy : మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించిన.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

2019 సార్వత్రిక ఎన్నికలకు మార్చి పదిన షెడ్యూల్ విడుదలైంది. దేశవ్యాప్తంగా ఎనిమిది విడతల్లో పోలింగ్ జరిగింది. జూన్ లో కౌంటింగ్ జరిగింది. ఇన్ని నెలలు ఎన్నికల ప్రక్రియ కొనసాగడంపై చాలా విమర్శలు వచ్చాయి. అందుకే ఈసారి ఎన్నికల సంఘం.. నాలుగు లేదా ఐదు విడతల్లోనే పూర్తి చేయాలని భావిస్తోంది. అందుకు అధికారంలో ఉన్న బీజేపీ కూడా అనుకూలంగానే ఉంది. పైగా మూడు రాష్ట్రాల్లో గెలిచిన సంతోషంలో ఉంది. ఆ పొలిటికల్ హీట్ తగ్గక ముందే ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందని బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నారట. ఫిబ్రవరిలో షెడ్యూల్ రీలీజ్ చేసి .. రెండు నెలల్లో ప్రక్రియ పూర్తి చేస్తే ఎక్కువ టైమ్ పట్టినట్టు కూడా ఉందడని అనుకుంటున్నారు.

కేంద్ర ఎన్నికల సంఘం కూడా సార్వత్రిక ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తి చేసింది. రిటర్నింగ్ ఆఫీసర్ల నియామకం దగ్గర్నుంచి EVMలను నియోజకవర్గాలకు చేర్చడం దాకా కంప్లీట్ అయ్యాయి. పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిషా లాంటి రాష్ట్రాల్లోనూ అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాలి. వాటికి కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఓటర్ల జాబితాను అప్ డేట్ చేసే పనిలో ఉంది ఈసీ. పోలింగ్ కేంద్రాల మార్పులు, చేర్పులు, ఓటర్ల ఫొటోల మార్పుల కోసం ఈ నెల 20 నుంచి జనవరి 5 వరకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. 2024 జనవరి 6న ముసాయిదా ఓటర్ల జాబితా, జనవరి 8న తుది ఓటర్ల జాబితా ప్రకటించనుంది. 2024 జనవరి ఒకటి వరకు 18 ఏళ్లు నిండిన వాళ్ళంతా ఓటరుగా నమోదు చేసుకోడానికి అవకాశం ఇచ్చింది. అంటే జనవరి మొదటి వారం కల్లా పూర్తి స్థాయిలో ఓటర్ జాబితాలు రెడీ అవుతాయి. దాంతో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయడానికి అంతా సిద్ధమైనట్టే. ఎండా కాలంలో లోపే ఎన్నిలకు పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయ పార్టీలు ఫిబ్రవరి ఎన్నికలకి రెడీ అయినట్టు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా ఎన్నికలు ఏప్రిల్ లో ఉంటాయని రిలాక్స్ అవ్వొద్దని చెబుతున్నారు. ఫిబ్రవరిలోనే ఉండవచ్చనీ.. అందుకు సిద్ధంగా ఉండాలని పిలుపు ఇచ్చారు. టీడీపీతో జనసేన కూటమి కూడా ఎన్నికలకు పూర్తిగా సిద్ధమవుతోంది. వైసీపీ కూడా ముందుగానే రంగంలోకి దిగింది. అసెంబ్లీతో పాటు, పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపైనా ఇప్పటికే కొలిక్కి వచ్చినట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇటు తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్ ముగిశాయి. ఫిబ్రవరిలో సార్వత్రిక ఎన్నికలు వస్తే.. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ సహా అన్ని పార్టీలు ఎదుర్కోడానికి సిద్ధంగానే ఉన్నాయి. ఈసారి అభ్యర్థుల జాబితా రిలీజ్ చేయడంలోనూ ఏ పార్టీకి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. ఎందుకంటే.. అసెంబ్లీ టిక్కెట్లు ఇచ్చేటప్పుడే పార్లమెంట్ అభ్యర్థులను కూడా డిసైడ్ చేశాయి అన్ని పార్టీలు. ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చినా అన్ని పార్టీలు రెడీగా ఉన్నట్లే.