గాయం నుంచి కోలుకున్నట్టేనా, ప్రాక్టీస్ మొదలుపెట్టిన గిల్

ఆసీస్ తో తొలి టెస్టులో గెలిచిన టీమిండియా ఇప్పుడు పింక్ బాల్ టెస్టుకు రెడీ అవుతోంది. ఈ మ్యాచ్ కంటే ముందు ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్ తో ప్రాక్టీస్ ఆడబోతోంది.

  • Written By:
  • Publish Date - November 30, 2024 / 12:35 PM IST

ఆసీస్ తో తొలి టెస్టులో గెలిచిన టీమిండియా ఇప్పుడు పింక్ బాల్ టెస్టుకు రెడీ అవుతోంది. ఈ మ్యాచ్ కంటే ముందు ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్ తో ప్రాక్టీస్ ఆడబోతోంది. ఈ నేపథ్యంలో టీమిండియాకు గుడ్ న్యూస్ వచ్చింది. ఓపెనర్ శుభ‌మ‌న్ గిల్‌ మ‌ళ్లీ బ్యాట్ ప‌ట్టాడు. కాన్‌బెరాలో ఇవాళ ప్రాక్టీస్ సెష‌న్‌లో పాల్గొన్నాడు. ఇటీవ‌ల గిల్ బొటనవేలికి గాయమైంది. ఈ గాయం కారణంగానే తొలి టెస్టుకు దూరమయ్యాడు. అయితే ఇవాళ ప్రాక్టీస్‌లో కనిపించడంతో రెండో టెస్టులో ఆడే అవకాశాలున్నాయి. ప్రస్తుతం గిల్ ఎలాంటి నొప్పి లేకుండా నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నాడని అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ చెప్పాడు. టీమిండియా ప్రాక్టీస్ సెషన్‌లో గిల్.. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. అండర్ ఆర్మ్ బంతులను ఆడాడు.