పాక్ హెడ్ కోచ్ గా గిలెస్పీ అన్ని ఫార్మాట్లకూ బాధ్యతలు

పాకిస్తాన్‌ క్రికెట్ జట్టు కొత్త కోచ్ గా జాసన్‌ గిల్లెస్పీ నియమితుడయ్యాడు. పరిమిత ఓవర్ల హెడ్‌ కోచ్‌ పదవికి గ్యారీ కిర్‌స్టన్‌ రాజీనామా చేసిన నేపథ్యంలో గిల్లెస్పీని పాక్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది.

  • Written By:
  • Publish Date - October 29, 2024 / 02:20 PM IST

పాకిస్తాన్‌ క్రికెట్ జట్టు కొత్త కోచ్ గా జాసన్‌ గిల్లెస్పీ నియమితుడయ్యాడు. పరిమిత ఓవర్ల హెడ్‌ కోచ్‌ పదవికి గ్యారీ కిర్‌స్టన్‌ రాజీనామా చేసిన నేపథ్యంలో గిల్లెస్పీని పాక్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. గిల్లెస్పీ కేవలం టెస్ట్‌లకు మాత్రమే కోచ్‌గా వ్యవహరించే వాడు. ఇప్పుడు అన్ని ఫార్మాట్లలోనూ అతనికే బాధ్యతలు అప్పగించారు. ఆటగాళ్లతో, క్రికెట్‌ బోర్డుతో విభేదాల కారణంగా కిర్‌స్టన్‌ హెడ్‌ కోచ్‌ పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. హై పెర్ఫార్మెన్‌ కోచ్‌గా డేవిడ్‌ రీడ్‌ను నియమించాలని కిర్‌స్టన్‌ కోరగా.. పాక్‌ క్రికెట్‌ బోర్డు అందుకు నిరాకరించినట్లు సమాచారం. ఇటీవలికాలంలో పాక్‌ క్రికెట్‌లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. బాబర్‌ ఆజమ్‌ పాక్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దీంతో బాబర్‌ స్థానంలో పాక్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా మహ్మద్‌ రిజ్వాన్‌ను నియమించారు.