GN Saibaba: ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా.. నాగ్‌పూర్ సెంట్రల్ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న కేసులో.. ఆయన నిర్దోషి అని బాంబే హైకోర్టు రెండు రోజుల క్రితం తీర్పునిచ్చింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని ట్రయల్ కోర్టు సాయిబాబా కేసులో అప్పట్లో విచారణ జరిపింది. 2014లో సాయిబాబాను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. పలు సెక్షన్ల కింద ఛార్జ్‌షీట్ నమోదు చేశారు. 2017లో గడ్చిరోలి జిల్లా సెషన్స్‌కోర్టు తీర్పు ఇస్తూ.. సాయిబాబాతో పాటు మరో అయిదుగురికి జీవిత ఖైదు విధించింది.
MALLAREDDY CONGRESS : కాంగ్రెస్ లోకి మల్లారెడ్డి ! రేవంత్ సెగ మామూలుగా లేదు…
ఆ తర్వాత ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్ ఉద్యోగాన్ని కూడా సాయిబాబా కోల్పోయారు. ఐతే ఆ తీర్పుపై ఆయన అప్పీల్‌కు వెళ్లారు. UAPA కేసులో నియమ నిబంధనలను పోలీసులు సరిగా పాటించలేదంటూ.. బాంబే హైకోర్టు 2022లోనే సాయిబాబాపై కేసును కొట్టివేసింది. ఆ తర్వాత మహారాష్ట్ర సర్కారు ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు అప్పీల్‌కు వెళ్లింది. దీంతో సాయిబాబా విడుదలపై అప్పట్లో స్టే పడింది. సాయిబాబా కేసును తిరిగి వినాలంటూ బాంబే హైకోర్టుకు సూచించింది. విచారించిన బాంబే హైకోర్టు సాయిబాబా సహా మొత్తం ఆరుగురిని నిర్దోషులుగా ప్రకటిస్తూ విడుదల చేయాలని ఆదేశించింది.
దాదాపు పదేళ్ల అక్రమ చెర నుంచి బయటకు వచ్చారని.. ఆయన మద్దతుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జైలు నుంచి బయటకు వచ్చిన సాయిబాబా.. చాలా బలహీనంగా కనిపించారు. తన ఆరోగ్యం చాలా వీక్‌గా ఉందని.. ఇప్పుడు తానేమీ మాట్లాడలేనని, ముందుగా మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవాలని.. ఆ తర్వాత మాట్లాడుతానని చెప్పారు.