GOLD PRICE: బంగారం పైపైకి.. ధరలు ఇంకా పెరుగుతాయా..?

మంగళవారం బులియన్‌ మార్కెట్‌లో 8వంద రూపాయలు పెరిగి తులం బంగారం 65వేల రికార్డు స్థాయికి చేరింది. గత ట్రేడింగ్‌ సెషన్‌లో బంగారం 64వేల 200 దగ్గర ముగిసింది. మరో వైపు వెండి సైతం 9వందల రూపాయల వరకు పెరిగి కిలోకు 74వేల 9వందలకు ఎగిసింది.

  • Written By:
  • Publish Date - March 7, 2024 / 08:17 PM IST

GOLD PRICE: బంగారం ధర ఒక్కసారిగా పెరిగింది. తులం బంగారం ధర ఒక్కసారిగా దాదాపు ఎనిమిది వందలకు పైగా పెరిగింది. ఇన్ని రోజులు స్థిరంగా ఉన్న ధర ఒక్కసారిగా పెరగడంతో షాక్ కు గురవుతున్నారు కొనుగోలుదారులు. పసిడి ధర ఇలానే ఉంటుందా.. ఇంకా పెరుగుతుందా.. ఇదే ఇప్పుడు చర్చ. గత నెల రోజుల నుంచి బంగారం ధరలు కాస్త పెరుగుతూ తగ్గుస్తూ వస్తున్నాయి. పసిడి ఎప్పుడు పైకి వెళ్తుందో.. ఎప్పుడు కిందికి దిగుతుందో తెలియడం లేదు. అయితే బంగారం ధరలు ఇంకాస్త పెరుగుతాయని మార్కెట్లో చర్చ జరుగుతున్న క్రమంలో నిన్న ఒక్కసారిగా పసిడి ధర పైకి లేచింది.

Narendra Modi: వివాహాలకోసం విదేశాలకు కాదు.. జమ్ము కాశ్మీర్ రండి: మోదీ

మంగళవారం బులియన్‌ మార్కెట్‌లో 8వంద రూపాయలు పెరిగి తులం బంగారం 65వేల రికార్డు స్థాయికి చేరింది. గత ట్రేడింగ్‌ సెషన్‌లో బంగారం 64వేల 200 దగ్గర ముగిసింది. మరో వైపు వెండి సైతం 9వందల రూపాయల వరకు పెరిగి కిలోకు 74వేల 9వందలకు ఎగిసింది. భారతీయ సంప్రదాయంలో పెళ్లి లాంటి పెద్ద శుభకార్యాల్లో బంగారం ఖచ్చితంగా ఉండాల్సిందే. మధ్యతరగతి వారైనా స్థోమతకు తగ్గట్టు అంతో ఇంతో బంగారాన్ని కొంటారు. కానీ ప్రస్తుతం బంగారం ధరలను చూస్తుంటే గ్రాము బంగారాన్నైనా కొనగలమా అనే స్థాయిలోకి చేరుతోంది. మనదేశ సంప్రదాయంలో బంగారానికి ఉన్న ప్రత్యేక స్థానం ఎంతలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. శుభకార్యం ఏదైనా సరే ఎంతో కొంత బంగారం కొత్తగా కొనాల్సిందే. తమ స్థాయిని, ఆర్థిక స్తోమతను బట్టి బంగారం కూడా ఎక్కువ.. తక్కువ ఉండొచ్చు. కానీ, బంగారం మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. గత కొంత కాలంగా పసిడి ధరలు పెరుగుతున్నాయి. ఈరోజు ఉన్న ధర రేపు ఉండటం లేదు.

BJP-TDP-JANASENA: టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తు.. మరికొన్ని గంటల్లో క్లారిటీ..

అలాగని ధర తగ్గుతుందని అనుకుంటే తప్పు. రోజు రోజుకు ధర పెరుగుతుంది. పెరుగుతున్న ధరలు సామాన్యులకు అందకుండా పైపైకి కదులుతూనే ఉన్నాయి. ధరలు పెరగడం వల్లే బంగారానికి డిమాండ్ తగ్గుంతుందా అనే మాట వినిపిస్తుంది. డాలర్ విలువ.. ఫెడ్ రేట్లు.. అంతర్జాతీయ మార్కెట్ లో ఎగుమతులు దిగుమతుల ప్రభావంతో బంగారం ధరలు ఆల్‌టైం రికార్డు స్థాయికి పెరగడంతో పాటు ధరల్లో హెచ్చుతగ్గులు కనిస్తున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 65వేలు అయింది. అయితే ధరల పెరుగుదల ఇంకా కొనసాగుతుందా లేదా అనే ప్రశ్నలో చాలామంది ఉన్నారు. బంగారం ధర తగ్గిన తరువాత మెల్లగా కొనొచ్చులే అనుకుని వెయిట్ చేస్తున్నారు చాలామంది. అసలు ధరలు ఏ మాత్రం తగ్గే అవకాశం లేదని.. వీలైతే ఇప్పుడే గోల్డ్ కొనడం బెటరని అంటున్నారు గోల్డ్ వ్యాపారులు. బంగారం ధరలపై వ్యాపారులు హాట్ న్యూస్ చెప్తున్నారు.

ఇప్పట్లో బంగారం ధర తగ్గడం పక్కన పెడితే మరి కొన్ని నెలల్లో 24క్యారెట్ల బంగారం ధర దాదాపు డెబ్బై వేలకు చేరుతుందని అంటున్నారు. బంగారం ధరలు పెరగడంతో గిరాకీ కాస్త తగ్గిన కూడా.. సీజన్‌లో మాత్రం కస్టమర్స్ తాకిడి ఉందని అంటున్నారు వ్యాపారులు. ఇప్పటివరకు బంగారాన్ని గ్రాముల్లో తీసుకునే వారు. కానీ ప్రస్తుతం ధరలు పెరగడంతో.. డబ్బును బట్టి ఎంత గోల్డ్ వస్తుందో అంత గోల్డ్ కొంటున్నారు. బంగారాన్ని లైఫ్ టైం ఇన్వెస్ట్‌మెంట్‌గా చూస్తారు అంతా. బంగారం ధరలు పెరగడంతో ఇప్పుడు ఆచితూచి కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరికొన్ని నెలల పాటు గోల్డ్ రేట్స్ పెరుగుతాయని వ్యాపారాలు చెబుతున్న కూడా మళ్ళీ ఒక్కసారిగా ఎప్పుడు ధరలు తగ్గుతాయో అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది.