భారతీయులకు, బంగారానికి విడదీయరాని అనుబంధం ఉంటుంది. మహిళలు పెద్ద ఎత్తున బంగారం కొనుగోలుకు మొగ్గుచూపుతుంటారు. బంగారం కొని అలంకరణగా ధరించడం.. బ్యాంకుల్లో దాచుకోవడం.. పెట్టుబడులు పెట్టడం.. వారసత్వంగా పిల్లలకు ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది. బంగారు ఆభరణాలు మహిళలకు అందాన్ని మరింత పెంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ మధ్య కాలంలో జీవన కాల గరిష్టాలను తాకిన బంగారం, వెండి ధరలు వరుసగా దిగొస్తున్నాయ్. అంతర్జాతీయ మార్కెట్లో, దేశీయ మార్కెట్లలో గోల్డ్ రేట్లు పడిపోతున్నాయ్. వరుసగా 4 రోజులు బంగారం రేటు తగ్గింది. ఇంటర్నేషనల్ మార్కెట్లోనూ గోల్డ్ రేట్లు భారీగా దిగొస్తున్నాయ్. వెండి ధరలు కూడా ఆల్ టైమ్ హై నుంచి తగ్గుతున్నాయి. 4రోజులుగా బంగారం ధరలు పడిపోతుండడంతో.. చాలామంది గోల్డ్ కొనేందుకు మొగ్గుచూపుతున్నారు. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర.. నాలుగు రోజుల్లో 13వందల రూపాయలకు పైగా తగ్గింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ రేటు చూస్తే 14వందవలకు పైగా పతనం అయింది. ఇప్పుడు పండగల కావడంతో.. రానున్న రోజుల్లో గోల్డ్ కొనేవారి సంఖ్య పెరుగుతుంది. దీంతో రేట్లు ఇంకా పడిపోయే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
బంగారం ధర 4 రోజుల్లో 13వందల నుంచి 14వందల వరకు తగ్గగా.. జీవన కాల గరిష్టాల నుంచి మాత్రం ఇంకా ఎక్కువే పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్లో మే 5న 22 క్యారెట్ల బంగారం రేటు ఏకంగా 57వేల 200 పలకగా.. ఇప్పుడు 53వేల 650గా ఉంది. అంటే ఏకంగా 3వేల 550 రూపాయలు పడిపోయింది. 24 క్యారెట్స్ గోల్డ్ రేటు అదే రోజున 62వేల 400గా ఉండగా.. ఇప్పుడు 58వేల 520 వద్దకు చేరింది. ఇక్కడ చూస్తే 3వేల 870 రూపాయలు పతనం అయింది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచనుందన్న అంచనాలతో.. బంగారం ధరలు దిగొస్తున్నట్లు తెలుస్తోంది. ఫెడ్ వడ్డీ రేట్లు పెంచితే అక్కడి యూఎస్ డాలర్, ట్రెజరీ ఈల్డ్స్ విలువ పెరిగి.. బంగారం ఆకర్షణ కోల్పోయి విలువ తగ్గుతుంది. ఫెడ్ త్వరలో వడ్డీ రేట్లు పెంచితే గోల్డ్ ధర మరింత పడిపోయే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.