ధగధగ మెరిసే ఈ బంగారం ఎప్పుడు పెరుగుతుందో.. ఎప్పుడు తగ్గుతుందో ఎవరికి తెలియాదు.. కొన్ని సార్లు ఒక్కసారిగా ఈ పసిడి ధరలు ఆకాశాన్ని అంటుతాయి. మరికొన్ని సార్లు కొస్తా తగ్గుదలతో ప్రజల చెంతకు చేరుతుంది. అందుకే తగ్గినప్పుడు బంగారం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అదే జరుగుతుంది కూడా.. మనం ఏ పని చేసిన మంచి ముహార్తం చూస్తుంటాం..కానీ బంగారం కొనుగోలుకు మాత్రం ముహూర్తం, వేళాపాళా చూడాల్సిన పని లేదు.. ఎప్పుడు అయితే బంగారం తగ్గుతుందో.. అప్పుడు పని గడ్డుకోని మరి బంగారం షాపుల వైపు పరుగెత్తారు.. అలా ఉంది మరి పసిడి డిమాండ్.
తాజాగా దేశంలో పసిడి ధరలు స్వల్పంగా పెరిగింది. వెండి ధర మాత్రం కాస్త తగ్గింది. మంగళవారం 10 గ్రాముల బంగారం ధర రూ. 65,100గా ఉండగా, బుధవారం రూ.300 పెరిగి రూ.65,400కు చేరుకుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ప్రస్తుతం 58,400 రూపాయలకు చేరుకుంది. మంగళవారం కిలో వెండి ధర రూ.76,786గా ఉండగా, రూ.300 తగ్గి కిలో ధర రూ.76,486గా ఉంది. గత రెండు రోజుల పాటు పసిడి ధరలు కాస్త స్థిరంగా ఉండటంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకునే లోపు.. ఇలా దేశ వ్యాప్తంగా బంగారం ధరలు పెరిగిపోయాయి.
హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ.₹65,400కు చేరుకుంది. కిలో వెండి ధర రూ.₹76,486గా ఉంది.
విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.₹65,400కు పెరిగింది. కిలో వెండి ధర రూ.₹76,486గా ఉంది.
విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.₹65,400గా ఉంది.
ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర ₹58,400 – 24 క్యారెట్ల బంగారం ధర ₹63,710
న్యూఢిల్లీ 22 క్యారెట్ల బంగారం ధర ₹58,550 – 24 క్యారెట్ల బంగారం ధర ₹63,860
అహ్మాదాబాద్ 22 క్యారెట్ల బంగారం ధర ₹58,450 – 24 క్యారెట్ల బంగారం ధర ₹63,760
మైసూర్ 22 క్యారెట్ల బంగారం ధర ₹58,400 – 24 క్యారెట్ల బంగారం ధర ₹63,710
చెన్నై 22 క్యారెట్ల బంగారం ధర ₹58,950 – 24 క్యారెట్ల బంగారం ధర ₹64,310
ముంబయి 22 క్యారెట్ల బంగారం ధర ₹58,400 – 24 క్యారెట్ల బంగారం ధర ₹63,710
కోయంబత్తూర్ 22 క్యారెట్ల బంగారం ధర ₹58,950 – 24 క్యారెట్ల బంగారం ధర ₹64,310
సూరత్ 22 క్యారెట్ల బంగారం ధర ₹58,450 – 24 క్యారెట్ల బంగారం ధర ₹63,760