Gold Rate Forecast 2024: బంగారం ధర రూ.70 వేలకు చేరుతుందా..? నిపుణులేమంటున్నారు..

ముఖ్యంగా ఈ ఏడాది బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని బులియన్ డీలర్లు, నగల వ్యాపారులు, మార్కెట్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే 10 గ్రాముల బంగారం ధర రూ.66,500 వరకు చేరుకుంది.

  • Written By:
  • Updated On - March 6, 2024 / 06:47 PM IST

Gold Rate Forecast 2024: బంగారం ధరలు ఇటీవలి కాలంలో వరుసగా పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ఏడాది బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని బులియన్ డీలర్లు, నగల వ్యాపారులు, మార్కెట్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే 10 గ్రాముల బంగారం ధర రూ.66,500 వరకు చేరుకుంది. త్వరలోనే ఈ ధర రూ.70,000 వరకు చేరుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Mukesh Ambani: రిటర్న్‌ గిఫ్ట్ అదుర్స్‌.. అతిథుల‌కు అంబానీ ఫ్యామిలీ రిట‌ర్న్ గిఫ్ట్.. ఏమిచ్చారంటే..

బంగారం ధర పెరగడానికి కారణాలున్నాయి. ఒకవైపు భౌగోళిక రాజకీయాలపరంగా ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్, హమాస్, రష్యా-యుక్రెయిన్ యుద్ధం వంటి ఆందోళనకర పరిస్థితులున్నాయి. మరోవైపు యూఎస్ ఫెడరల్ రిజర్వ్​ కీలక వడ్డీ రేట్లను తగ్గించే ఆలోచన చేస్తోంది. మరోసారి అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభం తలెత్తవచ్చని కూడా తెలుస్తోంది. మన దేశానికి సంబంధించి అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ తగ్గిపోతోంది. ప్రపంచ ఆర్థిక పరిణామాలు, వినియోగ డిమాండ్​ పెరగడం కూడా మార్కెట్లపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. దీంతో చాలా మంది సురక్షిత పెట్టుబడి మార్గంగా బంగారాన్ని ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం పెట్టుబడిదారులు అందరూ బంగారం కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారు.

ఈ కారణంగానే బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ బుల్లిష్​ ముమెంటం ఇంకా కొనసాగే అవకాశం ఉంది. దీంతో ఈ ఏడాదిలో బంగారం గరిష్ట ధరకు చేరుకోవచ్చని అంచనా. మార్కెట్ వర్గాల ప్రకారం.. ఈ ఏడాది 10 గ్రాముల బంగారం ధర రూ.70,000కు చేరుకుంటుంది. మన దేశ పజలకు బంగారం అంటే ఒక ప్రత్యేకమైన మక్కువ. ఇది సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. ఫలితంగా బంగారానికి డిమాండ్ పెరిగి, ధరలు కూడా భారీగా పెరుగుతాయి. అయితే, పెరుగుతున్న ధరలతో సామాన్యులు మాత్రం బెంబేలెత్తిపోతున్నారు. అసలే.. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఇప్పుడు బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉంది.