GOLD PRICES: మండిపోతున్న పసిడి.. రికార్డ్‌ స్థాయిలో పెరిగిన బంగారం ధర

కొన్ని రోజుల నుంచి బంగారం ధర అమాంతం పెరుగుతూ పోతోంది. ఇవాళ ఏకంగా 10 గ్రాముల బంగారం ధర వెయ్యికి చేరింది. గతవారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. వరుసగా నాలుగు రోజులు గోల్డ్ ధరల్లో తగ్గుదల కనిపించింది.

  • Written By:
  • Updated On - March 21, 2024 / 06:55 PM IST

GOLD PRICES: దేశంలో ఒక్కసారిగా బంగారం ధర రికార్డ్‌ స్థాయికి చేరింది. ఈ నెల మొదట్లో కాస్త తగ్గినట్టే కనిపించినా.. ఇప్పుడు మాత్రం ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. కొన్నేళ్లుగా ఎప్పుడూ లేనిది ఒకే రోజులో 10 గ్రాముల బంగారం ధర వెయ్యి రూపాయలు పెరిగింది. కొన్ని నగరాల్లో ఈ ధర వెయ్యికి పైగా కూడా ఉంది. అసలు ఈ స్థాయిలో బంగారం ధర పెరగడానికి కారణమేంటి..? కొన్ని రోజుల నుంచి బంగారం ధర అమాంతం పెరుగుతూ పోతోంది. ఇవాళ ఏకంగా 10 గ్రాముల బంగారం ధర వెయ్యికి చేరింది. గతవారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి.

MS DHONI: కెప్టెన్లకే కెప్టెన్ లాంటోడు.. సారథిగా ధోనీ రికార్డులు ఇవే

వరుసగా నాలుగు రోజులు గోల్డ్ ధరల్లో తగ్గుదల కనిపించింది. కానీ ఇప్పుడు ఒక్కసారిగా రికార్డు స్థాయిలో బంగారం ధర పెరగడంతో కస్టమర్లు ధరలనుచూసి బెంబేలెత్తిపోతున్నారు. మరోవైపు వెండి ధర సైతం భారీగా పెరిగింది. కిలో వెండిపై 15 వందలు పెరిగింది. ఈ క్యాలెండర్‌ ఇయర్‌లో వడ్డీ రేట్లలో మూడు కోతలు ఉంటాయని.. యూఎస్‌ ఫెడరల్ రిజర్వ్ ఛైర్‌ పానెల్‌ ప్రకటించడంతో బంగారం ధర రికార్డు స్థాయికి చేరింది. మార్కెట్‌ ప్రారంభంలోనే 2 వేల 2 వందల డాలర్ల పైకి దూసుకువెళ్లింది. ప్రస్తుతం ఔన్స్‌ బంగారం ధర 2 వేల 206 డాలర్ల వద్ద ఉంది. ఇక మన దేశంలోనూ పసిడి రేటు ఏకంగా వెయ్యికి పెరిగింది. వెండి రేటు కూడా క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం వెండి రేటు కిలోపై 1,500 పెరిగింది. తెలంగాణలో కూడా ఇవే రేట్లు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 61 వేల 800 ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర 67 వేల 420కి చేరింది. కిలో వెండి ధర 81 వేల 500గా ఉంది. తెలంగాణతో కంపేర్‌ చేస్తే ఏపీలో ఆర్నమెంట్‌ బంగారం ధర కాస్త తక్కువగా ఉంది. ప్రస్తుతం విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర 60 వేల 800గా ఉంది. ఇది మినహాయిస్తే రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు సమానంగా కొనసాగుతున్నాయి.