క్రికెట్ కు సాహా గుడ్ బై

టీమిండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌తో సహా అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ తన కెరీర్‌లో చివరిదని తెలిపాడు.

  • Written By:
  • Publish Date - November 4, 2024 / 04:53 PM IST

టీమిండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌తో సహా అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ తన కెరీర్‌లో చివరిదని తెలిపాడు. 2010లో భారత జట్టులోకి అరంగేట్రం చేసిన సాహా 2021 వరకు ప్రాతినిథ్యం వహించాడు. టెస్టులకు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత వికెట్ కీపర్‌గా సాహాకే సెలక్టర్లు ప్రాధాన్యతనిచ్చారు.అయితే రిషభ్ పంత్, కేఎస్ భరత్ రాకతో టెస్టుల్లో చోటు కోల్పోయాడు. 40 ఏళ్ల వృద్ధిమాన్ సాహా భారత్ తరఫున 40 టెస్టులు, 9 వన్డేలు ఆడాడు. 2021లో టీమిండియాకు చివరిసారిగా ఆడాడు. అటు ఐపీఎల్ కు కూడా సాహా వీడ్కోలు పలికాడు. మెగావేలం కోసం అతను తన పేరును రిజిస్టర్ చేసుకోలేదు. ఐపీఎల్ కెరీర్ లో సాహా 170 మ్యాచ్ లు ఆడాడు.