vijay political party : సినిమాలకు గుడ్ బై… రాజకీయాల్లోకి ఇళయదళపతి విజయ్

తమిళనాడు రాజకీయాలకి (Tamil Politics) తమిళ సినిమా పరిశ్రమకి మధ్య ఉన్న అనుబంధం ఈ నాటిది కాదు. ఐదు దశాబ్దాల నుంచి తమిళనాడు లో రాజ్యాధికారాన్ని చెలాయిస్తోంది సినిమా వాళ్ళు స్థాపించిన పార్టీలే.

 

 

తమిళనాడు రాజకీయాలకి (Tamil Politics) తమిళ సినిమా పరిశ్రమకి మధ్య ఉన్న అనుబంధం ఈ నాటిది కాదు. ఐదు దశాబ్దాల నుంచి తమిళనాడు లో రాజ్యాధికారాన్ని చెలాయిస్తోంది సినిమా వాళ్ళు స్థాపించిన పార్టీలే. తాజాగా మరో సినిమా హీరోకి సంబంధించిన ఒక పార్టీ తమిళనాడు రాజకీయాల్లో పురుడుపోసుకోబోతుందనే వార్తలు ఇప్పుడు ఇండియన్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి

తమిళ అగ్ర హీరో విజయ్ (Vijay Dalapathy) త్వరలోనే ఒక రాజకీయ పార్టీని (New Party) స్థాపించబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఇందుకు బలం చేకూర్చేలా విజయ్ ఇటీవల మక్కల్ ఇక్కయం నిర్వాహకులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసాడు.ఈ సమావేశంలో విజయ్ పూర్తిగా పొలిటికల్ కి సంబంధించిన విషయాల గురించే మాట్లాడాడు. అలాగే సమావేశంలో పాల్గొన్న విజయ్ ఫ్యాన్స్ అందరు కూడా వీలైనంత త్వరగా కొత్త రాజకీయ పార్టీ పెట్టాలని డిమాండ్ చేసారు. విజయ్ కూడా వాళ్ళ మాటలకి సానుకూలంగా స్పందించాడు .దీంతో అతి త్వరలోనే విజయ్ రాజకీయ పార్టీ పెట్టబోతున్నాడనే ప్రచారం జోరందుకుంది

తమిళనాట విజయ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రతేక్యంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఆయన ఏది చెప్తే అది చెయ్యడానికి అతని అభిమానులు రెడీగా ఉంటారు.ఎన్నో ఏళ్లుగా పలు సామాజిక కారక్రమాలు కూడా చేసుకుంటు వస్తున్న విజయ్ రాజకీయ పార్టీ స్థాపిస్తే ఎంత మేరకి రాణిస్తాడో చూడాలి.రజనీకాంత్ వెనుకంజ వేసిన నేపథ్యంలో విజయ్ పొలిటికల్ ఎంట్రీ మీద అందరిలోను ఆసక్తి నెలకొని ఉంది. సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి వస్తాడో లేదో కొన్ని రోజుల్లో తేలనుంది.