26 ఏళ్ళకే ఆటకు గుడ్ బై బౌన్సర్లు తట్టుకోలేక రిటైర్మెంట్

క్రికెట్ లో బౌన్సర్లు సర్వసాధారణం... పైగా ఐసీసీ ఇప్పుడు ఓవర్ కు రెండు బౌన్సర్లను అనుమతించడంతో పేసర్లు వాటినే అస్త్రాలుగా మార్చుకుంటున్నారు. అయితే ఈ రాకాసి బౌన్సర్లతో ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతున్న పరిస్థితి...

  • Written By:
  • Publish Date - August 29, 2024 / 08:59 PM IST

క్రికెట్ లో బౌన్సర్లు సర్వసాధారణం… పైగా ఐసీసీ ఇప్పుడు ఓవర్ కు రెండు బౌన్సర్లను అనుమతించడంతో పేసర్లు వాటినే అస్త్రాలుగా మార్చుకుంటున్నారు. అయితే ఈ రాకాసి బౌన్సర్లతో ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతున్న పరిస్థితి… ఇలాంటి బౌన్సర్లను ఎదుర్కోవడం తన వల్ల కాక ఆసీస్ యువ క్రికెటర్ 26 ఏళ్ళకే రిటైర్మెంట్ ప్రకటించాడు. విక్టోరియా తరపున ఆడుతున్న విల్ పుచోవిస్కీ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వరుస గాయాలను తట్టుకోలేక క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. ముఖ్యంగా తలకు గాయాలవడం అతని కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపించింది.

హోబర్ట్‌లో జరిగిన షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లో విక్టోరియా తరపున టాస్మానియాతో చివరిసారిగా ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియన్ పేసర్ రిలే మెరెడిత్ వేసిన బౌన్సర్ కు బంతి అతని హెల్మెట్‌ కు తగలడంతో తీవ్ర గాయమైంది. అప్పటి వుంచి వరుస గాయాలు వెంటాడుతూనే ఉన్నాయి. కాగా వైద్య కారణాలతోనే అతని కెరీర్ ముగిసిందని విక్టోరియా వర్గాలు తెలిపాయి. బౌలర్లు ఈ మధ్య కాలంలో తన హెల్మెట్ నే టార్గెట్ చేసుకుంటున్నారంటూ ఈ యువ క్రికెటర్ వ్యాఖ్యానించాడు.21 ఏళ్ళ వయసులోనే పుచోవిస్కీ ఆస్ట్రేలియా టెస్ట్ జట్టులో స్థానం సంపాదించాడు. 2021 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ పై సిడ్నీలో ఏకైక అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ ఆడాడు.