బంగారు ప్రియులకు గుడ్ న్యూస్.. గత నాలుగు రోజులుగా వరుసగా పెరుగుతూ బంగారం ప్రియులకు చుక్కలు చూపిస్తున్న పసిడి.. నేడు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతియ మార్కెట్ లో బంగారం ధరలు పడిపోయింది. కాగా, శనివారం గోల్డ్ రేటు కాస్త తగ్గగా.. ఆదివారం నేడు స్థిరంగా కొనసాగుతుంది. మరోవైపు వెండి ధర వరుసగా మూడ్రోజులు పెరగ్గా.. ఆదివారం వెండి ధరలో ఎలాంటి మార్పులు కపిపించడం లేదు. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుతున్న క్రమంలో ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై పడుతోంది. ప్రస్తుతం మన దేశంలో వివాహాలు, ఇతర శుభకార్యాలు ఉన్న క్రమంలో బంగారానికి గిరాకీ పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది.
- హైదరాబాద్ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,750 కాగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 68,450
- విజయవాడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,750 కాగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 68,450
- విశాఖపట్టణంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,750 కాగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 68,450 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
- దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 62,900 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 68,600.
- ముంబయి 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 62,750 కాగా, 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 68,450.
- కోల్ కతా 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 62,750 కాగా, 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 68,450.
- బెంగళూరు నగరాల్లో.. 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 62,750 కాగా, 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 68,450.
- చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.63,700 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ రూ.69,490.
స్థిరంగా వెండి ధర ..
- దేశం వ్యాప్తంగా వెండి ధరల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇలా..
- హైదరాబాద్ కిలో వెండి రూ.81,000
- విజయవాడ కిలో వెండి రూ.81,000
- విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.81,000 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
- బెంగళూరులో కిలో వెండి ధర రూ.77,000
- ఢిల్లీ కిలో వెండి ధర రూ.78,000
- ముంబయి కిలో వెండి ధర రూ.78,000
- కోల్‌కతా ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.78,000
- చెన్నైలో కిలో వెండి రూ. 81,000 వద్ద కొనసాగుతుంది.