Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. మెట్రో రైలు సమయం పొడిగింపు…

రోజురోజుకు మెట్రో (Metro) లో రద్దీ పెరుగుతున్న దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో ప్రయాణ వేళల్లో మార్పులు చేసినట్లు సమాచారం.

రోజురోజుకు మెట్రో (Metro) లో రద్దీ పెరుగుతున్న దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో ప్రయాణ వేళల్లో మార్పులు చేసినట్లు సమాచారం. హైదరాబాద్ మెట్రో రైలు (Hyderabad Metro Rail) వేళల్లో అధికారులు మార్పు.. మెట్రో రైలు సర్వీసులు (Metro Rail Services) ప్రయాణికులకు మరింత చేరువయ్యేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాజమాన్యం తెలిపింది. ఈ క్రమంలోనే సాధారణంగా రోజూ నడిచే సమయం కంటే.. ఇంకాస్త ఎక్కువ సేపు రైలు సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాయి. ఇప్పటి వరకు రాత్రి 11గంటలకు చివరి రైలు ఉండగా.. ఇక నుంచి 11.45గంటలకు చివరి రైలు అందుబాటులో ఉండనుంది. అలాగే ప్రతి సోమవారం ఉదయం 5.30గంటలకే మెట్రో రాకపోకలు మొదలు కానున్నాయి. మిగతా రోజుల్లో సాధారణంగానే ఉదయం 6గంటల నుంచే మెట్రో పరుగులు పెట్టనుంది. పొడిగించిన వేళలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని తెలిపారు. 2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో సగటున నిత్యం 4.4లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు. ఈ సంఖ్య 5.5లక్షలకు చేరితే మెట్రో ప్రాజెక్ట్ ఆర్థికంగా మెరుగవుతుంది.