తెలంగాణ నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభ వార్త చెబుతుంది. ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెండు రోజుల్లో ఉద్యోగాల భర్తీపై సమీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణ వ్యప్తంగా ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఖాళీల గురించి పూర్తి వివరాలను తీసుకోని రివ్యూ మీటింగ్ కు హాజరుకావాలని టీఎస్ పీఎస్సీ ఛైర్మన్ బి. జనార్థన్ రెడ్డిని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుండి 2014 నుంచి టీఎస్ పీఎస్సీ ద్వాదా భర్తీ చేసిన ఉద్యోగాలు, నోటిఫికేషన్ లకు సంబంధించిన పూర్తి వివరాలతో సమీక్షకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాదిన్నరగా.. టీఎస్ పీఎస్సీలో పేపర్ల లీక్ లు, ఆపై పరీక్షల వాయిదాల వ్యవహారంతో ప్రతిష్టంభన కొనసాగుతున్న విషయం తెలిసిందే..