LPG Gas Cylinder : దేశ సార్వత్రిక ఎన్నికల వేళ సామాన్యులకు శుభవార్త.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు..

దేశంలో సార్వత్రిక ఎన్నికల (General Elections) వేళ సామాన్యులకు భారీ ఊరట.. ఇప్పటికే దేశంలో రెండు విడతల్లో ఎన్నికలు ముగిశాయి. రేపు మే 3న మూడో దశ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. దీంతో ప్రజలకు మధ్యతరగతి వారికి గుది బండలా మారిన.. గ్యాస్ సిలిండర్ (Gas Cylinder) ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అందులో నేడు మే డే కావడం.. ఒక వరంగా భావిస్తున్నారు ప్రజలు..

దేశంలో సార్వత్రిక ఎన్నికల (General Elections) వేళ సామాన్యులకు భారీ ఊరట.. ఇప్పటికే దేశంలో రెండు విడతల్లో ఎన్నికలు ముగిశాయి. రేపు మే 3న మూడో దశ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. దీంతో ప్రజలకు మధ్యతరగతి వారికి గుది బండలా మారిన.. గ్యాస్ సిలిండర్ (Gas Cylinder) ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అందులో నేడు మే డే కావడం.. ఒక వరంగా భావిస్తున్నారు ప్రజలు..

ఇక విషయంలోకి వెళితే.. దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ ను వినియోగదారులు రెండు రకాలుగా ఉన్న విషయం తెలిసిందే.. ఒకటి ఇళ్లలో వినియోగించే గ్యాస్ సిలిండర్.. మరోకటి వ్యాపారులు వినియోగించే గ్యాస్ సిలిండర్.. కాగా ఇందులో సామన్యులు ఇళ్లలో వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరలు.. వ్యాపారులు గ్యాస్ సిలిండర్ ధరలు రెండు ఒకేలా ఉండవని విషయం తెలిసిందే..

తాజాగా చమురు మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ ఎల్పీజీ (Commercial LPG)గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గించాయి. 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరపై రూ.19 తగ్గిస్తున్నట్లు కంపెనీలు ప్రకటించాయి. ఈ గ్యాస్ సిలిండర్ ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. గతంలో కేంద్ర ప్రభుత్వం మార్చి 9న ఇళ్లలో వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరను రూ.200 తగ్గించింది. అదే విధంగా ఏప్రిల్ నెలలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు తగ్గాయి.

ప్రధాన నగరాల్లో ఇలా..

  • ఇవాళ 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర ప్రస్తుతం ఢిల్లీలో రూ.1764.50 నుంచి రూ.1745.50కి తగ్గింది.
  • హైదరాబాద్‌లో రూ.32.50 తగ్గిన కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.1994.50గా ఉంది
  • కోల్‌కతాలో కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.1879.00 నుంచి రూ.1859.00కి దిగొచ్చింది
  • ముంబైలో రూ.1717.50 నుంచి రూ.1698.50కి తగ్గింది
  • చెన్నైలో రూ.1930.00 నుంచి రూ.1911కి తగ్గుదల కనపడింది.

వంట గ్యాస్ ధరల్లో నిల్లు …

  • 14.2 కిలోల సిలిండర్ ధర హైదరాబాద్‌లో రూ.855గా కొనసాగుతోంది.
  • లక్‌నవూలో రూ.840.5గా ఉంది.
  • జైపూర్‌లో రూ.806.50గా కొనసాగుతోంది.
  • గురుగ్రామ్‌లో రూ.811.50గా ఉంది.
  • ఢిల్లీలో రూ.803గా కొనసాగుతోంది.

గత ఏడాది మే నెలతో పోల్చినట్లు అయితే ఈసారి సిలిండర్ ధరలు దిగి వచ్చాయని మార్కెట్ నిపుణులు వెల్లడించారు. గతేడాది మే నెల ప్రారంభంలో సిలిండర్ ధర ఏకంగా రూ. 172 మేర తగ్గింది.

SSM